భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
అగ్రరాజ్యం అమెరికాలో కల్లోల పరిస్థితులు నెలకున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ వర్సెస్ అమెరికా అత్యున్నత న్యాయస్థానం అన్నట్లుగా అక్కడి సిచ్యువేషన్ తయారైంది. పదవిలోకి రాగానే ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడిన సంగతి విదితమే. తనకు లొంగని దేశాలపై భారీ స్థాయిలో సుంకాలను విధించారు. అయితే తాజాగా ఈ సుంకాల విధింపు ఉత్తర్వులను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది రాజ్యాంగ విరుద్దమని తేల్చి చెప్పింది. అయితే ట్రంప్ ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ 10 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెట్టుబడిదారులు అలర్ట్ అయి తమ పెట్టుబడులను పసిడి వైపు తరలిస్తున్నారు. అమెరికా డాలర్ కుప్పకూలడంతో దాని మీద పెట్టుబడులు పెట్టడం మానేశారు. దీంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ధరలు చుక్కలను తాకేందుకు రెడీ అయ్యాయి. ముందు ముందు ఈ పరిస్థితులు చక్కబడే అవకాశం లేకపోవడంతో బంగారం ధరలు పైకి పెరుగుతాయే కాని తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ రోజు కూడా ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 21, శనివారం దేశంలోని బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1910 పెరిగి రూ.1,59,280 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,750 పెరిగి రూ.1,46,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,430 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,46,150 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,59,280 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,46,000 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,150 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,46,800 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,280 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,000 పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.20,000 పెరిగి రూ.2,90,000 గా కొనసాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
చేపల కోసం చెరువులోకి వల వేసాడు.. దొరికింది చూసి స్టన్ అయ్యాడు..
బయటపడిన ఉండవల్లి గుహల రహస్యాలు ఇవే
ఆధునికతతో అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. కుమ్మరుల జీవనం
గ్రామంలో వరుసగా మరణిస్తున్న కోతులు.. ఆందోళనలో గ్రామస్తులు
ఎండలు ముదురుతున్నాయ్.. బీ అలర్ట్
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
అనంతపురంలో సిమ్లా యాపిల్స్ సాగు.. ఇదిగో ఇలా..

