Tollywood : కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఫస్ట్ సినిమాకే అవార్డ్.. మూడు సినిమాలు చేస్తే రెండు ఆగిపోయాయి.. ఒకటి బ్యాన్ అయ్యింది..
ఒకప్పుడు ఆమె కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. అందం, అభినయంతోపాటు గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేసింది. అయినప్పటికీ ఈ ముద్దగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఇటీవల సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు పలు వివాదాల్లోనూ చిక్కుకుంది. అంతేకాదు ఆమె నటించిన ఓ సినిమాను ఏకంగా భారతదేశంలో బ్యాన్ చేశారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో పలు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. మొదటి సినిమాతోనే అవార్డ్ అందుకుంది. ఆమె మరెవరో కాదు.. వాణి కపూర్. 2013లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, పరిణీతి చోప్రా కలిసి నటించిన సినిమా శుద్ధ దేశీ రొమాన్స్. ఈమూవీతోనే సినీరంగంలోకి తెరంగేట్రం చేసింది వాణి కపూర్. ఆమె తొలి చిత్రంతోనే ఉత్తమ తొలి నటిగా అవార్డ్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 2016లో ఆదిత్య చోప్రా నటించిన బేఫికర్ మూవీలో రణవీర్ సింగ్ సరసన నటించి మెప్పించింది.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
ఆమె మొదటి రెండు మూడు చిత్రాలతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ క్వీన్ గా నిలిచింది. హిందీలో వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా నిలిచింది. అలాగే తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. 2014లో న్యాచురల్ స్టార్ నాని జోడిగా ఆహా కళ్యాణం సినిమాలో నటించింది. తెలుగులోనూ మంచి పాపులారిటి వచ్చినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే హిందీలో ఎక్కువ సినిమాలు చేస్తున్న ఆమెకు ఇటీవల ఒక ఎదురుదెబ్బ తగిలింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
వాణి కపూర్ నటించిన మూడు సినిమాలు ఆగిపోయాయి. ఆమె నటిస్తున్న సర్వకున్ సంపన్ సినిమా షూటింగ్ 2023లో ఆగిపోయింది. అలాగే అపరశక్తి ఖురానా, పరేష్ రావల్, వాణి కపూర్ నటించిన పథమీస్ కిల్ సినిమా 20224 నవంబర్ లో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాను కొనుగోలు చేయడానికి సరైన పంపిణీదారులు కనిపించలేదు. అసాదే అబీర్ గులాల్ అనే సినిమాను ఫవాద్ ఖాన్ సరసన నటించింది. 2025 ఏప్రిల్ లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తానీ కళాకారులపై నిరసనలు రావడంతో ఈసినిమాను ఇండియాలో బ్యాన్ చేశారు.
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
