- Telugu News Photo Gallery Business photos Maruti Suzuki Ertiga Huge demand for this 7 seater cars in India
Top 7 Seater Cars: భారతదేశంలో 7 సీట్ల కారుకు భారీ డిమాండ్.. మొదటి స్థానంలో ఏ కారు ఉందో తెలుసా?
Top 7 Seater Cars: భారత మార్కెట్లో 7 సీట్ల కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ ట్రెండ్ ఫిబ్రవరి 2025 లో కూడా కొనసాగింది. జనవరిలో మారుతి ఎర్టిగా ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయించిందిసుజుకి. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే దీని అమ్మకాలు కొద్దిగా తగ్గాయి. అదే సమయంలో మహీంద్రా స్కార్పియో, బొలెరో అమ్మకాలు తగ్గాయి. వీటన్నింటి మధ్య, మహీంద్రా XUV 700 అమ్మకాలు ఫిబ్రవరిలో 14 శాతం పెరిగాయి. మారుతి సుజుకి XL6, టాటా సఫారీ అమ్మకాలు కూడా బాగా పడిపోయాయి.
Updated on: Apr 07, 2025 | 8:39 AM

మారుతి సుజుకి ఎర్టిగా: ఫిబ్రవరి 2025లో మారుతి సుజుకి కాంపాక్ట్ MPV ఎర్టిగా, మహీంద్రా స్కార్పియోను అధిగమించి అత్యధికంగా అమ్ముడైన 7-సీట్ల ప్యాసింజర్ కారుగా నిలిచింది. అయినప్పటికీ దాని అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ఫిబ్రవరి 2025లో 14,868 యూనిట్ల ఎర్టిగా అమ్ముడయ్యాయి. ఇది ఫిబ్రవరి 2024లో 15,519 యూనిట్లతో పోలిస్తే 4 శాతం తగ్గుదల.

మహీంద్రా స్కార్పియో: ఫిబ్రవరిలో 13,618 యూనిట్లు అమ్ముడై, మహీంద్రా స్కార్పియో ఈ జాబితాలో రెండవ అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కారుగా నిలిచింది. గత ఏడాది ఫిబ్రవరిలో అమ్ముడైన 15,051 యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య 15% ఎక్కువ. ఇది 10 శాతం తగ్గుదల చూసింది.

మహీంద్రా బొలెరో: మహీంద్రా బొలెరో అమ్మకాలు కూడా తగ్గాయి. ఈ కాంపాక్ట్ 7-సీటర్ కారు ఫిబ్రవరి 2025లో 8,690 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఫిబ్రవరి 2024లో అమ్ముడైన 10,113 యూనిట్ల నుండి 14 శాతం తగ్గుదల.

టయోటా ఇన్నోవా: టయోటా ఇన్నోవా సిరీస్‌లో ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా అమ్మకాలు ఫిబ్రవరిలో స్థిరంగా ఉన్నాయి. మొత్తం 8,449 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి 2024లో 8,481 యూనిట్లు అమ్ముడయ్యాయి.

మహీంద్రా XUV 700: గత ఫిబ్రవరిలో మహీంద్రా XUV 700 అమ్మకాలు భారీగా పెరిగాయి. మహీంద్రా నుండి వచ్చిన ఈ అద్భుతమైన 7-సీటర్ SUV అమ్మకాలు 14 శాతం పెరిగాయి. ఫిబ్రవరి 2025లో 7,468 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి 2024లో 6,546 యూనిట్లు అమ్ముడయ్యాయి.

టయోటా ఫార్చ్యూనర్: టయోటా శక్తివంతమైన SUV ఫార్చ్యూనర్ అమ్మకాలు ఫిబ్రవరిలో తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 2025లో 2,876 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఫిబ్రవరి 2024లో అమ్ముడైన 3,395 యూనిట్లతో పోలిస్తే 15 శాతం తగ్గుదల.




