AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Tragedy: తెల్లారితే పెళ్లి.. అంతలోనే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?

ఆ రోజు శుక్రవారం ఫిబ్రవరి 20 తెల్లవారితే శనివారం ఉదయం ఇద్దరూ అక్కా చెల్లెళ్లకు పెళ్లి జరగాల్సి ఉంది.. ఇంతలోనే సరిగ్గా ఉదయం 4 గంటలకు ఆ ఇద్దరు అక్కా చెల్లెల్ల ఆరోగ్యం క్షీణించింది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే వాళ్లు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో వెలుగు చూసింది. తెల్లారితే పెళ్లి పీటలెక్కాల్సిన కూతుళ్లు తిరిగి రాని లోకాలకు వెల్లిపోవడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Wedding Tragedy: తెల్లారితే పెళ్లి.. అంతలోనే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?
Rajasthan Wedding Suicide
Anand T
|

Updated on: Feb 22, 2026 | 4:05 PM

Share

తెల్లారితే పెళ్లనంగా ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందిన దీప్ సింగ్ అనే వ్యక్తికి శోభ (25), విమల (23) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్నారు. అయితే దీప్‌సింగ్ ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేయాలని నిర్ణయింది. శనివారం వారికి పెళ్లి ఫిక్స్ చేశారు. శనివారం వారికి పెళ్లి జరగాల్సి ఉంది.

దీంతో శుక్రవారం రాత్రి ఇంట్లో పెళ్లి వేడుకలు పూర్తయ్యాయి. మార్నింగ్ పెళ్లి మండపానికి వెళ్లేందుకు అంతా సిద్ధం చేశారు కుటుంబ సభ్యులు.. అయితే సరిగ్గా శనివారం తెల్లవారుజామున ఉన్నట్టుండి శోభ, విమల ఇద్దరి ఆరోగ్యం ఒక్కాసారిగా క్షీణించింది. దీంతో పేరెంట్స్ వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వాళ్లని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారు. అది విన్న తల్లిదండ్రులు షాక్ అయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులతో మాట్లాడి అక్కాచెల్లెళ్ల మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పురుగుల మందు లేదా ఇతర ఏవైనా విషపదార్థం తీసుకొని ఉండవచ్చిని అందుకే వారు మరణించినట్టు వైద్యులు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిది ఆత్మహత్యగానే పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత వారి మరణానికి గల కచ్చితమైన సమాధానం చెప్తామని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అక్కాచెల్లెల మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందుకు గల కారణాలను తేల్చే పనిలో పడ్డారు. ఇంట్లో వాళ్ల ఒత్తిడి కారణంగానే వాళ్లు ఇలా చేశారా? లేదా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us