AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ఎంతకు తెగించావ్‌రా.. ప్రియురాలి ప్రైవేట్ పార్ట్స్‌పై శానిటైజర్ పోసి నిప్పంటించిన ప్రియుడు!

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన లివిన్‌లో ఉన్న తన ప్రియురాలిపై ఓ యువకుడు అతి కిరాతకంగా దాడి చేశాడు. పెళ్లి చేసుకోవాలని యువతి అడగడంతో కోపోదృక్తుడైన యువకుడు ఆమె జననంగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం యువతి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Crime News: ఎంతకు తెగించావ్‌రా.. ప్రియురాలి ప్రైవేట్ పార్ట్స్‌పై శానిటైజర్ పోసి నిప్పంటించిన ప్రియుడు!
Gurugram Incident
Anand T
|

Updated on: Feb 22, 2026 | 5:17 PM

Share

ప్రియురాలి ప్రైవేట్ పార్ట్స్‌పై ప్రియుడు శానిటైజర్ పోసి నిప్పంటించిన ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురకు చెందిన 19 ఏళ్ల యువతి గురుగ్రామ్‌లో ఉంటూ బయోటెక్నాలజీ చదువుతోంది. అయితే డేటింగ్‌ యాప్‌లో గాతేడాది ఈ యువతి శివం అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉండాలని ఫిక్స్ అయ్యారు.

ఇక సెక్టార్ 69లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఇద్దరూ అక్కడే సహజీవనం చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇటీవలే ఇద్దరి మధ్య పెళ్లి విషయంలో వివాదం చెలరేగింది. యువతి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమలో తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకుడు ఆమెపై దాడి చేసి, ఒక గదిలో బంధించింది ఆమె ప్రైవేట్ బాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. ఇలానే సుమారు మూడు రోజుల పాటు యువకుడు ఆమెకు నరకం చూపించాడు.

మూడ్రోజు తర్వాత యువతి ధైర్యం తెచ్చుకొని తల్లికి ఫోన్‌ చేసి జరిగింది మొత్తం చెప్పింది. దీంతో బాధిత తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతిని రక్షించి స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అతన్ని అరెస్ట్ చేసింది రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై హత్యయత్నం, అత్యాచారం సహా బిఎన్‌ఎస్ సెక్షన్లు 115, 118(1), 118(2), 127(2), 69,351(2) కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని, పూర్తి స్థాయి మెడికల్ రిపోర్టులు వచ్చాక నిందితుడిపై మరిన్ని సెక్షన్ల నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..