వేసవిలో మఖానా తింటే ఏమవుతుందో తెలుసా? 

04 April 2026

Jyothi Gadda

ఎండలు ముదురుతున్న సమయంలో మనం తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వేడిని తగ్గించి, ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల కోసం చూస్తున్నారా? అయితే మఖానా లేదా తామర గింజలు మీకు సరైన ఎంపిక.

శరీరాన్ని చల్లబరుస్తుంది: మఖానాకు శరీరంలోని వేడిని గ్రహించి, ఉష్ణోగ్రతను సమతుల్యం చేసే గుణం ఉంది. ఎండ దెబ్బ (Sunstroke) తగలకుండా ఇది రక్షణ కల్పిస్తుంది.

గుండె ఆరోగ్యం:  ఇందులో సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును (Blood Pressure) నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియకు మేలు: వేసవిలో చాలామందికి జీర్ణ సమస్యలు ఎదురవుతుంటాయి. మఖానాలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

యాంటీ ఏజింగ్ గుణాలు: ఎండ వల్ల చర్మం త్వరగా ముడతలు పడటం లేదా నల్లబడటం జరుగుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, సూర్యరశ్మి ప్రభావం నుండి కాపాడుతుంది.

వేసవిలో పెరుగులో వేయించిన మఖానా గింజలు కలిపి తింటే రుచితో పాటు చలవ చేస్తుంది. లేదంటే, కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించి, తక్కువ ఉప్పుతో స్నాక్‌లా తీసుకోవచ్చు.

రాత్రి పూట పాలలో కలిపి తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియలో తోడ్పడుతుంది. దీంతో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. 

ఉదయాన్నే పాలలో నానబెట్టిన మఖానీ తింటే రెట్టింపు లాభాలు అందుతాయి. పాలలోని ప్రోటీన్, కాల్షియం, మఖానాలోని ఫైబర్‌తో కలిసి సూపర్‌ఫుడ్‌గా మారుతుంది. శరీరం కూడా ఎనర్జీగా ఉంటుంది.

వేసవిలో జంక్ ఫుడ్ లేదా నూనెలో వేయించిన పదార్థాలకు బదులుగా మఖానాను ఎంచుకోవడం ఉత్తమం. ఇది మీ ఆకలిని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.