AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌‌కు వాతావరణ గండం.. 1,000 కి.మీ. మేర కమ్మేసిన మేఘాలు.. ఆ రాష్ట్రాలకు హై అలర్ట్..

అటు పాకిస్తాన్ నుంచి ఇటు భారత్ వరకు సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. బలమైన పశ్చిమ అవాంతరం ప్రభావంతో రాబోయే రోజుల్లో ఉత్తర భారతదేశం అస్థిరంగా మారబోతోంది. ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు భారీ వర్షాలతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిది.

భారత్‌‌కు వాతావరణ గండం.. 1,000 కి.మీ. మేర కమ్మేసిన మేఘాలు.. ఆ రాష్ట్రాలకు హై అలర్ట్..
Western Disturbance Alert
Krishna S
|

Updated on: Apr 03, 2026 | 8:41 PM

Share

దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. . ఉత్తర భారతదేశం వైపు దూసుకొస్తున్న ఒక బలమైన పశ్చిమ అవాంతరం కారణంగా రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ నుంచి పాకిస్తాన్ వరకు సుమారు 1,000 కిలోమీటర్ల మేర భారీ మేఘాలు కమ్ముకున్నాయి. ఇది రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏయే రాష్ట్రాలపై ప్రభావం..?

మధ్యధరా సముద్రం నుంచి వస్తున్న ఈ పశ్చిమ అవాంతరం కారణంగా వాయువ్య భారతదేశం అంతటా వాతావరణం అస్థిరంగా మారింది. దీని ప్రభావం ప్రధానంగా కొన్ని ప్రాంతాలపై ఉండనుంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ హిమపాతం లేదా వర్షం కురిసే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వడగళ్ల వాన.. పెరగనున్న చలి తీవ్రత

వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. రాబోయే వారాల్లో వాతావరణం మరింత తేమగా మారనుంది. హిమాలయ పర్వత పాదాల వద్ద ఉన్న ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అకాల వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి, ప్రజలు మళ్లీ చల్లని గాలులను అనుభవించే అవకాశం ఉంది.

అప్రమత్తంగా ఉండాలి

మెరుపులు, భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రైతులు తమ కోతకు వచ్చిన పంటలను కాపాడుకోవాలని, ప్రయాణికులు పర్వత ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణం క్రమంగా అస్థిరంగా మారుతుండటంతో ఐఎమ్‌డి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

Follow Us