Telangana: ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.! ఇది కదా కావాల్సింది.. గ్యాస్ సిలిండర్ ఇస్తే నెలంతా టిఫిన్ ఉచితం
గ్యాస్ సిలిండర్ కొరతతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఓ హోటల్ సిబ్బంది ఇదే పరిస్థితిలో పడి.. ఓ ఆఫర్ ప్రకటించారు. మీరు సిలిండర్ ఇవ్వండి.. ఫ్రీగా టిఫిన్ తినేసి వెళ్లండి అని చెప్పారు. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ హోటల్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. మిగతా రంగాలపై కూడా ఎఫెక్ట్ ఉన్నా.. గ్యాస్ కొరత సామాన్యులను వేధిస్తోంది. హోటల్స్‌పై ఆధారపడి జీవనం సాగించేవారికి గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతూ హోటల్స్ మూసివేసి పరిస్థితి నెలకొంది. నల్ల బజారులో ఒక్కో గ్యాస్ సిలెండర్ ధర రూ. 3 వేలకు చేరిపోవడంతో అంత డబ్బులు పెట్టి కొనలేక అవకాశం ఉన్నోళ్లు కట్టె పొయ్యిలు పెట్టి నెట్టుకొస్తుంటే.. ఆ అవకాశం లేనోళ్లు హోటల్స్ మూసివేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో T3 హోటల్ యాజమాన్యం బ్లాకులో గ్యాస్ కొనలేక, హోటల్ మూసి వేసి వర్కర్స్‌ను పస్తులు ఉంచలేక ఓ ఆఫర్ ప్రకటించారు. తమకు ఓ గ్యాస్ సిలెండర్ ఇచ్చి ఖాళీ సిలెండర్, గ్యాస్ డబ్బులు తీసుకోండి. ప్రతిఫలంగా నెల మొత్తం ఫ్రీగా కడుపునిండా టిఫిన్ తిని వెళ్ళండి.. అని బ్యానర్ పెట్టడంతో.. ఈ ఫ్రీ టిఫిన్ ఆఫర్‌కి ఒకరిద్దరు సిలెండర్లు ఇచ్చి టిఫిన్ తిని వెళుతున్నారని.. లాభనష్టాలు సంగతి ఎలా ఉన్నా తన దగ్గర పనిచేసే వారికి పస్తులు లేకుండా అన్నం పెట్టగలుగుతున్నామని చెప్పారు.
ఇది చదవండి: లేటుగా సూర్యోదయం.. సాయంత్రం కనిపించని గ్రామం! ఎక్కడో కాదు మన తెలంగాణలోనే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
