Folk Song : ఏం పాట రా బాబు.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. ఇంకా రిలీజ్ అయితే పరిస్థితి ఏందీ..
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ పాటలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా పాటలకు మించి వ్యూస్, రెస్పాన్స్ సాధిస్తూ అటు యూట్యూబ్, ఇటు నెట్టింట దూసుకుపోతున్నాయి. భాష అర్థం కాకపోయినా ప్రపంచం మొత్తం ఈ పాటలను తెగ ఎంజాయ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ సాంగ్ విడుదలకు ముందే దుమ్మురేపుతుంది.

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాను ఏలేస్తున్నాయి. ఈ పాటలకు వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా పాటలకు మించిన వ్యూస్ అందుకుంటున్నాయి. భాష అర్థం కాకపోయిన తెలంగాణ మాస్ ఫోక్ బీట్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో పల్లె పాటలు ప్రపంచ వేదికపై సందడి చేశాయి. ఇప్పుడు దేశ వ్యా్ప్తంగా ఈ ఫోక్ సాంగ్స్ అందరినీ అలరిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పల్లె పాటలు మారుమోగుతున్నాయి. పెళ్లిళ్లు, పండగలు, స్కూల్ వీడ్కోల కార్యక్రమాలు.. ఇలా ప్రతి వేడుకలో ఈ ఫోక్ పాటలకు చిన్నా పెద్దా డ్యాన్స్ చేస్తున్నారు. ఇక ఇన్ స్టా రీల్స్ సంగతి చెప్పక్కర్లేదు.
ఇప్పటికే అనేక పాటలు ట్రెండ్ అవుతుండగా.. గత వారం రోజులుగా ఓ సాంగ్ బీట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇంకా పాట రిలీజ్ కాకముందే ఇటీవల విడుదలైన చిన్న బీట్ కు నెట్టింటిని షేక్ చేస్తుంది. ఇన్ స్టాలో పది రీల్స్ చూస్తే దాదాపు 8 రీల్స్ ఈ పాటకు స్టెప్పులేసే వీడియోస్ ఉన్నాయంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్కా పల్లె పాట.. జోష్ నింపే మాస్ బీట్.. సులభంగా ఎంజాయ్ చేసే స్టెప్పులు.. మొత్తానికి ఈ పాట ఇప్పుడు అటు ఇన్ స్టా.. ఇటు యూట్యూబ్ ను అల్లాడించేస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ సాంగ్ ప్రోమో సైతం విడుదల కాలేదు.
ఈ పాటకు స్టెప్పులు నేర్పిన కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ రిలీజ్ చేసిన చిన్న బీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. నెట్టింట ట్రెండ్ అవుతున్న ఆ పాట ఏంటో తెలుసా.. అదే “గురియవన్నే చీరకట్టి గుద్దినట్టి గోసికట్టి గున్న గున్న పోయే కుమ్మరోళ్ల సిన్నది.. చల్ గున్న గున్న పోయే కుమ్మరోళ్ల సిన్నది.. ” అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తుంది. ఈ పాటను ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ రచించగా.. గాయని లక్ష్మక్క, మల్లిక్ తేజ కలిసి పాడారు. అలాగే ఈ పాటకు శేఖర్ వైరస్ కొరియోగ్రాఫీ అందించారు. ఈ పాటకు మీరు స్టెప్పులేయండి..
ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..
