అజ్మీర్ సెంట్రల్ జైలు మాజీ మహిళా జైలర్ దివ్య చౌదరి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఇద్దరు మహిళా ఖైదీలను కోర్టు అనుమతి లేకుండా తన ఇంటి పనులకు తీసుకెళ్లారు. ఈ కేసులో సస్పెండై, అజ్ఞాతంలోకి వెళ్లిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె తాను జైలర్గా పనిచేసిన అజ్మీర్ జైలుకే ఖైదీగా వెళ్లారు.