Virat-Anushka: రూ.44 కోట్లు.. విరుష్క లేటెస్ట్ లగ్జరీ ఇల్లు
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ముంబైలో మూడు ఖరీదైన అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీటి మొత్తం విలువ రూ.44.1 కోట్లుగా తెలుస్తోంది. వెర్సోవా యారి రోడ్డులోని ఒకే అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్లలో ఒకటి అనుష్క, మరొకటి ఆమె తల్లిదండ్రులు కొనుగోలు చేయగా, మూడో అపార్ట్‌మెంట్‌ను విరాట్-అనుష్క కలిసి సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలీభాగ్‌లోనూ ఈ జంటకు విలువైన ఆస్తులు ఉన్నాయి.
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ జోడీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దశాబ్దకాలంగా అన్యోన్యంగా కొనసాగుతూ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్న విరుష్క.. పెట్టుబడులు పెట్టడంలోనూ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే ఎన్నో వ్యాపారాల్లో భాగమైన విరాట్- అనుష్క.. గురుగ్రామ్, అలీభాగ్‌లలో ఖరీదైన నివాస స్థలాలు కొనుగోలు చేశారు. తాజాగా ముంబైలోనూ ఈ జంట మూడు అపార్డుమెంట్లు కొన్నట్లు సమాచారం. వీటి మొత్తం విలువ రూ. 44.1 కోట్లు అని తెలుస్తోంది. నేషల్ మీడియా కథనం ప్రకారం.. ముంబైలోని వెర్సోవా యారి రోడ్డులో గల ఓ ఖరీదైన భవన సముదాయంలో ఒకే ఫ్లోరులో ఈ మూడు అపార్టుమెంట్లు ఉన్నాయి. వీటిలో అనుష్క శర్మ సొంతంగా ఓ అపార్టుమెంటు కొనుగోలు చేయగా.. దాని పక్కనే ఉన్న అపార్టుమెంటును ఆమె తల్లిదండ్రులు సొంతం చేసుకున్నారు. అదే ఫ్లోరులో మరో అపార్టుమెంట్‌ను భర్త విరాట్‌తో కలిసి అనుష్క కొనుక్కుంది. ఇక మరో రిపోర్ట్ ప్రకారం అనుష్క శర్మ తన విలాసవంతమైన అపార్టుమెంటు కోసం రూ. 14.9 కోట్లు ఖర్చు చేసింది. దీనిని జూలై 8, 2026లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆమె.. రూ. 74.48 లక్షల మేర స్టాంపు డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక అపార్టుమెంట్ మొత్తం విస్తీర్ణం దాదాపు 2153.7 చదరపు అడుగులు కాగా.. ఇందులో 2026 చదరపు అడుగులు కార్పెట్ ఏరియా ఉండగా.. 128 చదరపు అడుగుల విశాలమైన బాల్కనీ ఏరియా ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. అనుష్క శర్మ తల్లిదండ్రులు ఆషిమా, అజయ్ కుమార్ శర్మ రూ. 10.91 కోట్లకు అపార్టుమెంట్ కొనుగోలు చేయగా.. దీని విస్తీర్ణం 1577 చదరపు అడుగులు అని సమాచారం. అదే విధంగా.. విరాట్- అనుష్క కలిసి రూ. 18.29 కోట్లతో అదే ఫ్లోరులోని మరో అపార్టుమెంట్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి- అనుష్క శర్మ ఈ ఏడాది జనవరిలో అలీభాగ్‌లోని జిరాద్ గ్రామంలో 5.19 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర సుమారు రూ. 37.86 కోట్లు అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జనవరి 13న రిజిస్ట్రేషన్ పూర్తి కాగా.. స్టాంపు డ్యూటీగా రూ. 2.27 కోట్లు చెల్లించినట్లు సమాచారం. కాగా 2022లో అలీభాగ్‌లోనే విరుష్క జోడీ ఎనిమిది ఎకరాల భూమి కొని.. అక్కడ విలాసవంతమైన హాలీడే హోం నిర్మించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ప్రేమలో ఉన్న విరాట్- అనుష్క 2017లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరికి కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. పిల్లల గోప్యత, రక్షణ కోసం విరాట్ కుటుంబం ఎక్కువగా లండన్‌లోనే నివాసం ఉంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏఐతో రిస్క్ తప్పదు.. అయినా ఆపలేం!
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే
Rashmika Mandanna: ఓవరాక్షన్, క్రింజ్ అంటారా.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన రష్మిక
చిరు – ఓదెల సినిమాపై.. నాని షాకింగ్ కామెంట్స్! ఉన్నట్టా.. లేనట్టా.. అంటే..?
దిమ్మతిరిగే ఫోక్ సాంగ్‌తో.. కంబ్యాక్ ఇచ్చిన మాధురి రాథోడ్
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

