శ్రీ సత్యసాయి జిల్లా, కదిరిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 16 ఏళ్లుగా ఎదురుచూసి గర్భం దాల్చిన జ్యోతి అనే 9 నెలల గర్భిణీ ప్రసవానికి కొద్ది రోజుల ముందు అనారోగ్యంతో మృతి చెందారు. సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఆమె అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.