ఒక్క సినిమాకు 8 కోట్లా..? నాకు అంత సీన్ లేదు.. శ్రీనిధి శెట్టి.. 

Rajitha Chanti

Pic credit - Instagram

10 October 2026

‘కేజీఎఫ్’ 1, 2 చిత్రాలతో పాన్-ఇండియా స్థాయిలో అపారమైన క్రేజ్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ చిత్రాల విజయం తర్వాత ఆమెకు ఇండస్ట్రీలో భారీ క్రేజ్ వచ్చింది. అయితే ఇటీవల ఆమె రెమ్యునరేషన్ భారీగా పెంచిందంటూ కామెంట్స్ వినిపించాయి.

ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 7 నుంచి 8 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ రూమర్లపై తాజాగా ఈ బ్యూటీ స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. తన రెమ్యునరేషన్ గురించి వస్తున్న వార్తలను శ్రీనిధి శెట్టి తీవ్రంగా ఖండించారు.

తాను ఇండస్ట్రీకి వచ్చి చేసింది అతి తక్కువ సినిమాలేనని, అలాంటప్పుడు అంత భారీ మొత్తాన్ని ఎలా డిమాండ్ చేయగలనని ఆమె ప్రశ్నించారు.

కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తే తాను ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రాజెక్ట్‌లు చేసి ఉండేదాన్నని రూమర్స్ పై కౌంటరిచ్చారు హీరోయిన్ శ్రీనిధి

తనకు డబ్బు కంటే మంచి కథలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలే ముఖ్యమని తేల్చిచెప్పారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి ఇండస్ట్రీలోకి వచ్చారు.

మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కేజీఎఫ్'తో నటిగా అరంగేట్రం చేసి మొదటిసారే బ్లాక్‌బస్టర్ అందుకున్నారు.