AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drishyam 3: బాలీవుడ్‌కు కొత్త ఊపిరి! 500 కోట్ల దిశగా దృశ్యం కలెక్షన్స్‌

Drishyam 3: బాలీవుడ్‌కు కొత్త ఊపిరి! 500 కోట్ల దిశగా దృశ్యం కలెక్షన్స్‌

Phani CH
|

Updated on: Oct 10, 2026 | 7:09 PM

Share

అజయ్‌ దేవ్‌గణ్‌ నటించిన ‘దృశ్యం 3: ది కంక్లూజన్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన ఏడు రోజుల్లోనే భారత్‌లో రూ.245.50 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. విదేశీ మార్కెట్లలోనూ మంచి ఆదరణ లభించడంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్‌ కలెక్షన్లు రూ.383.60 కోట్లకు చేరుకున్నాయి. దీంతో ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అజయ్‌ దేవ్‌గణ్‌ కెరీర్‌లోనూ మరో భారీ విజయంగా ఈ సినిమా నిలుస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక విజయం సాధించిన చిత్రాల్లో దృశ్యం 3 ఒకటి. హీరో అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు విడుదలైన ఈ దృశ్యం ఫ్రాంచైజీలో అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలించింది పార్ట్ 3. భారతదేశంలో రూ. 245 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అంతకు ముందు విడుదలైన దృశ్యం 2 భారతదేశంలో రూ.240 కోట్లు.. దృశ్యం సినిమా భారతదేశంలో రూ.67.13 కోట్లు రాబట్టింది. ఇక ఇప్పుడు దృశ్యం 3 మాత్రం అజయ్ దేవ్‌గన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే దిశగా దూసుకుపోతోంది. 7వ రోజున, ‘దృశ్యం 3: ది కంక్లూజన్’ 15,758 షోలలో రూ.13 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం గ్రాస్ కలెక్షన్స్ రూ.294.60 కోట్లకు, నెట్ వసూళ్లు రూ.245.50 కోట్లకు చేరాయని సాక్నిల్క్ తెలిపారు. విదేశాలలో, ఈ చిత్రం 7వ రోజున రూ.4 కోట్లు వసూలు చేసింది, దీంతో ఇప్పటివరకు దాని మొత్తం విదేశీ వసూళ్లు రూ.89 కోట్లకు చేరుకున్నాయి. ఇది ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లను రూ.383.60 కోట్లకు చేర్చింది. శుక్రవారం నాడు దృశ్యం 3 రూ. 62 కోట్లు వసూలు చేయగా, శనివారం రూ. 53.50 కోట్లు వసూలు చేసింది. ఆదివారం నాడు ఈ చిత్రం రూ. 61 కోట్లు వసూలు చేసి, తొలిరోజు వసూళ్లకు సమానంగా నిలిచింది. మంగళవారం మాదిరిగానే, బుధవారం ఉదయం, మధ్యాహ్నం షోలలో దృశ్యం3 నిశ్శబ్దంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక సాయంత్రం షోల గురించి చెప్పక్కర్లేదు. ఊహించని విధంగా హౌస్ ఫుల్ బోర్డ్స్ లతో దూసుకుపోయింది. దృశ్యం ఫ్రాంఛైజీలో మొదటి రెండు చిత్రాలకు జీతూ జోసెఫ్ కథ అందించగా.. ఇప్పుడు ఈ దృశ్యం ది కంక్లూజన్ చిత్రానికి సహ రచయిత అభిషేక్ పాఠక్ అందించారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్ , స్టార్ స్టూడియో18 నిర్మించాయి. ఇది దృశ్యం 2 చిత్రానికి సీక్వెల్.దాని మునుపటి చిత్రాలలా కాకుండా, ఈ చిత్రం ఒక అసలైన కథను కలిగి ఉంది . కథా పరంగా దాని మలయాళ చిత్రంతో సంబంధం లేదు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, జైదీప్ అహ్లావత్, టబు, శ్రియా శరణ్, రజత్ కపూర్, ప్రకాష్ రాజ్, ఇషితా దత్తా నటించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hanuman Ansh: హనుమాన్ అంశ్ తెలుగు ఎలా ఉంటే.. హిట్టా.. ఫట్టా

Comrade Kalyan: వీడు కామెడీ కళ్యాణ్‌.. ఎలా ఉందంటే..

Sigma: ‘సిగ్మా’ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

OTTలోకి నాని ప్యారడైజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..

Virat-Anushka: రూ.44 కోట్లు.. విరుష్క లేటెస్ట్ లగ్జరీ ఇల్లు

Follow Us