AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Comrade Kalyan: వీడు కామెడీ కళ్యాణ్‌.. ఎలా ఉందంటే..

Comrade Kalyan: వీడు కామెడీ కళ్యాణ్‌.. ఎలా ఉందంటే..

Phani CH
|

Updated on: Oct 10, 2026 | 7:06 PM

Share

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ కామెడీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది. ఫస్టాఫ్‌లో హీరో కామెడీ టైమింగ్‌, సత్య పంచ్‌ డైలాగ్స్‌ బాగా నవ్విస్తాయి. అయితే సెకండాఫ్‌లో అడవి నేపథ్య సన్నివేశాలతో వినోదం తగ్గి కథనం నెమ్మదిస్తుంది. విజయ్‌ బుల్గనిన్‌ సంగీతం, సహజమైన కెమెరా పనితనం సినిమాకు బలంగా నిలిచాయి. లాజిక్స్‌ పక్కనపెట్టి వినోదం కోసం చూస్తే ఈ సినిమా చాలా చోట్ల నవ్విస్తుంది.

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన సినిమా కామ్రేడ్ కళ్యాణ్. నక్సలిజం బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుటోందనేది ఈ రివ్యూలో చూద్దాం.. పోలీసులు, నక్సలిజం, ప్రభుత్వ వ్యవస్థల చుట్టూ తిరిగే చాలా బరువైన పాయింట్‌ను తీసుకుని, దానికి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ముడిపెట్టి డైరెక్టర్ ఈ చిత్రాన్ని నడిపించాడనే చెప్పాలి. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్‌ను కామెడీ యాంగిల్‌లో చెప్పాలనుకోవడం సాహసమే. అయితే లాజిక్స్ పక్కనపెట్టి కేవలం వినోదం కోణంలో చూస్తే మాత్రం చాలా చోట్ల బాగా నవ్వులు పూస్తాయి. ఫస్టాఫ్‌ మొత్తం పాత్రల పరిచయం, హీరో లవ్ ట్రాక్, డబ్బు కోసం చేసే ప్రయత్నాలతో చాలా సరదాగా సాగిపోతుంది. అంతేకాదు కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్వించడంతో.. ఫస్టాఫ్ ఎక్కడా బోర్ కొట్టదు.కానీ సెకండాఫ్‌ మొదలయ్యాక అడవి నేపథ్యంలో సీన్స్ ఉండటంతో నవ్వించే స్కోప్ బాగా తగ్గిపోయింది. చుట్టూ తుపాకులు పట్టుకున్న వాళ్ల మధ్య ఫన్ క్రియేట్ చేయడం కష్టంగా మారడంతో ఇక్కడి నుంచి సినిమా కాస్త నెమ్మదిస్తుంది. మధ్యలో రాజకీయ నాయకు చూట్టూ ఓ కామెడీ ట్రాక్‌ను అల్లినా.. అది అప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు సినిమాను మెసేజ్‌లతో కాకుండా సరదాగా ఎండ్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే.. తనదైన టైమింగ్‌తో ఈ సినిమాను ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్లాడు హీరో శ్రీవిష్ణు. పెద్దగా బలం లేని డైలాగులకు కూడా తన మార్క్ యాక్టింగ్‌తో ప్రాణం పోసి ప్రేక్షకులను నవ్వించాడు. ఇక ఈ చిత్రానికి మరో ప్రధాన బలం కమెడియన్ సత్య. ఫస్ట్ హాఫ్‌లో విదేశాల నుంచి వచ్చిన వాడిగా ఎంట్రీ ఇచ్చి కడుపుబ్బా నవ్వించాడు. తన బాడీ లాంగ్వేజ్, పంచ్ డైలాగ్స్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. విలన్‌గా చేసిన ఉపేంద్ర నటన కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా నటించిన షైన్ టాం చాకోకి పెద్దగా స్కోప్ దొరకలేదు. హీరోయిన్ పాత్ర కథలో ఉన్నప్పటికీ పెర్ఫార్మెన్స్ చేయడానికి పెద్దగా ఛాన్స్ దక్కలేదు. సీనియర్ నటి రాధిక క్యారెక్టర్ మొదట్లో యాక్టివ్‌గా అనిపించినా ఆ తర్వాత సైడ్ అయిపోయింది. సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్ అందించిన పాటల్లో హీరోయిన్ మీద వచ్చే సాంగ్ తో పాటు అడవి నేపథ్యంలో వచ్చే ఒక విప్లవ గీతం చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు తగ్గట్లుగా సెట్ అయింది. కెమెరా వర్క్ పల్లెటూరి వాతావరణాన్ని, అటవీ ప్రాంతాన్ని చాలా అందంగా, సహజంగా చూపించింది. మాటల రచయితలు రాసిన ట్రెండీ డైలాగ్స్ చాలా చోట్ల బాగా వర్కవుట్ అయ్యాయి. పోటీగా వేరే సినిమాలు లేకపోవడం, వరుస సెలవులు రావడం ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసిరానుంది. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే కామ్రేడ్ కళ్యాణ్.. కామెడీ కళ్యాణ్..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sigma: ‘సిగ్మా’ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

OTTలోకి నాని ప్యారడైజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..

Virat-Anushka: రూ.44 కోట్లు.. విరుష్క లేటెస్ట్ లగ్జరీ ఇల్లు

Follow Us