OTTలోకి నాని ప్యారడైజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ ఓటీటీ విడుదలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తుండగా, అక్టోబర్ 23 విడుదల తేదీపై కూడా ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో మిస్ అయిన ‘దేశం’ పాటను ఓటీటీ వెర్షన్‌లో చేర్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఖచ్చితమైన స్ట్రీమింగ్ తేదీపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ది ప్యారడైజ్’. దసరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొంందిన ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లలో మాత్రం నాని సినిమా అదరగొట్టింది. ట్రేడ్ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ నాని సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఓవర్సీస్ లోనూ ది ప్యారడైజ్ కు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. థియేట్రికల్ రన్ పరంగా అదరగొట్టేసినా.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై విపరీతమైన వెయిటింగ్ ఉంది. ఈక్రమంలోనే నాని ప్యారడైజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ‘ది ప్యారడైజ్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ తర్వాత 6 నుంచి 8 వారాల తర్వాతే మాత్రమే సినిమాను ఓటీటీలోకి తీసుకువచ్చేలా అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ది ప్యారడైజ్ సినిమా స్ట్రీమింగ్ కు రావొచ్చని తెలుస్తోంది. ఇక రన్ టైమ్ కారణంగా ఈ సినిమా నుంచి ఒక పవర్‌ఫుల్ ‘దేశం’ సాంగ్‌ను థియేటర్లలో తప్పనిసరి పరిస్థితుల్లో తీసి వేయాల్సి వచ్చింది. అయితే సిల్వర్ స్క్రీన్ పై మిస్ అయిన ఆ గూస్ బంప్స్ సాంగ్ ను ఓటీటీ వెర్షన్ లో జోడించనున్నారట మేకర్స్. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్వయంగా వెల్లడించారు. దీంతో ది ప్యారడైజ్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

