AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ స్టార్ హీరో ఇంట పెళ్లి సందడి..

టాలీవుడ్ స్టార్ హీరో ఇంట పెళ్లి సందడి..

Phani CH
|

Updated on: Oct 10, 2026 | 7:12 PM

Share

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన చిన్న కుమార్తె అంజనా ఈ నెల 18న తన ప్రియుడిని పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. దాదాపు 13 ఏళ్ల ప్రేమకు ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ముగింపు పలకనుంది. కాబోయే వరుడి వివరాలు అధికారికంగా వెల్లడికాకపోయినా, ఈ జంట ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

టాలీవుడ్ యాక్షన్‌ కింగ్ అర్జున్‌ సర్జా ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కూతురు అంజనా పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 18న ఆమె మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. దాదాపు 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న అంజనా ఇప్పుడు పెద్దల సమక్షంలో ప్రియుడితో కలిసి ఏడడుగులు నడవనుంది. అయితే అంజనాకు కాబోయే భర్త ఎవరన్నది ఇంకా అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే ఈ ప్రేమ పక్షుల ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు. చూడముచ్చటి జంట అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అర్జున్ సర్జా. 1988లో కన్నడ నటి నివేదితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారీ యాక్షన్ కింగ్. వీరికి ఐశ్వర్య, అంజనా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా రాణిస్తోంది. అలాగే తన తండ్రి వ్యాపారం, నిర్మాణ సంస్థ పనులు కూడా చూసుకుంటోంది. ఇక అర్జున్ చిన్న కూతురు అంజనా మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. తన ఫ్యామిలీ నేపథ్యానికి భిన్నంగా బిజినెస్ ఉమెన్ గా రాణిస్తోంది. 2023లో హ్యాండ్ బ్యాగుల తయారీ సంస్థను ప్రారంభించింది అంజనా. ఇక్కడ తయారయ్యే హ్యాండ్ బ్యాగులన్నీ కూడా కేవలం పండ్ల తొక్కలు , కూరగాయల తొక్కలు, నార వంటి వాటితోనే తయారు చేస్తారు. పర్యావరణానికి అనుకూలంగా తయారు చేస్తున్న ఈ హ్యాండ్ బ్యాగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం బిజినెస్ లో రాణిస్తూనే ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యింది అంజనా. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన బ్లాస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అభిరామి, ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా రూ. 75 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Puri Jagannath: ఏం జరిగినా మన మంచికే.. గాయాలు మానాకే.. అసలు సినిమా..!

Drishyam 3: బాలీవుడ్‌కు కొత్త ఊపిరి! 500 కోట్ల దిశగా దృశ్యం కలెక్షన్స్‌

Hanuman Ansh: హనుమాన్ అంశ్ తెలుగు ఎలా ఉంటే.. హిట్టా.. ఫట్టా

Comrade Kalyan: వీడు కామెడీ కళ్యాణ్‌.. ఎలా ఉందంటే..

Sigma: ‘సిగ్మా’ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Follow Us