AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mokshagna Teja: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్

Mokshagna Teja: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్‌కి ముహూర్తం ఫిక్స్

Phani CH
|

Updated on: Oct 10, 2026 | 7:17 PM

Share

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్‌. అంతేకాకుండా, డిసెంబర్‌ మొదటి వారంలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ట కాంబినేషన్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక అదిరిపోయే సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కేవలం మోక్షజ్ఞను హీరోగా నిలబెట్టడమే కాకుండా, స్వయంగా బాలకృష్ణే కీలక పాత్రలో మెరవబోతున్నట్లు బలమైన టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలోనే లాంఛనంగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమాలతో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి, త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. వెండితెరపై నందమూరి వారసుడి రాక ఖరారవడంతో పాటు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్డేట్స్ వైరల్ అవుతుండటంతో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

irumudi: లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో.. ‘ఇరుముడి’ టీమ్ విజయోత్సవ వేడుకలు

టాలీవుడ్ స్టార్ హీరో ఇంట పెళ్లి సందడి..

Puri Jagannath: ఏం జరిగినా మన మంచికే.. గాయాలు మానాకే.. అసలు సినిమా..!

Drishyam 3: బాలీవుడ్‌కు కొత్త ఊపిరి! 500 కోట్ల దిశగా దృశ్యం కలెక్షన్స్‌

Hanuman Ansh: హనుమాన్ అంశ్ తెలుగు ఎలా ఉంటే.. హిట్టా.. ఫట్టా

Follow Us