AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi in Mann Ki Baat: జెర్సీ ఏదైనా.. రక్తం మనదే.. టీ20 వరల్డ్ కప్ ఆటగాళ్లపై ప్రధాని మోదీ ప్రశంసలు

PM Modi in Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‎లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు వివిధ దేశాల తరపున ఆడుతూ సత్తా చాటుతుండటాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

PM Modi in Mann Ki Baat:  జెర్సీ ఏదైనా.. రక్తం మనదే.. టీ20 వరల్డ్ కప్ ఆటగాళ్లపై ప్రధాని మోదీ ప్రశంసలు
Pm Modi In Mann Ki Baat
Rakesh
|

Updated on: Feb 22, 2026 | 4:28 PM

Share

PM Modi in Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‎లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు వివిధ దేశాల తరపున ఆడుతూ సత్తా చాటుతుండటాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. విదేశీ జెర్సీలు వేసుకున్నప్పటికీ, మన మూలాలు ఉన్న ఆటగాళ్లు మైదానంలో కనిపిస్తుంటే భారతీయులందరి హృదయాలు గర్వంతో నిండిపోతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఎక్కడ ఉన్నా సరే భారతీయులు తమ మూలాలను మర్చిపోరని, తాము నివసించే దేశం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన కొనియాడారు.

ఈ వరల్డ్ కప్‌లో భారత సంతతి ఆటగాళ్ల ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రధాని కొన్ని ఉదాహరణలతో వివరించారు. ముఖ్యంగా కెనడా జట్టులో అత్యధికంగా భారత మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా పంజాబ్‌లోని గుర్దాస్‌పూర్‌లో జన్మించగా, నవనీత్ ధాలివాల్ చండీగఢ్ వాసి అని తెలిపారు. హర్ష్ థాకర్, శ్రేయాస్ మోవా వంటి ఆటగాళ్లు కెనడా గర్వపడేలా ఆడుతున్నారని ప్రధాని అన్నారు. అలాగే అమెరికా జట్టులో కూడా మన దేశవాళీ క్రికెట్ నుంచి వెళ్లిన సౌరభ్ నేత్రావల్కర్ (ముంబై), హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్ (ఢిల్లీ) వంటి వారు అమెరికా జట్టుకు వెన్నెముకగా నిలిచారని ప్రశంసించారు. అమెరికా కెప్టెన్ మొనాంక్ పటేల్ గుజరాత్ అండర్-16, అండర్-18 జట్లకు ఆడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

కేవలం అగ్రరాజ్యాలే కాకుండా ఒమన్, యూఏఈ, న్యూజిలాండ్, ఇటలీ వంటి దేశాల జట్లలోనూ భారత సంతతి క్రికెటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని మోదీ అన్నారు. ఒమన్ జట్టులో జతీందర్ సింగ్, వినాయక్ శుక్లా, కరణ్, జై, ఆశిష్ వంటి వారు ఆ దేశ క్రికెట్‌కు బలమైన లింకులుగా మారారని తెలిపారు. “నేను తరచూ చెబుతుంటాను.. ఆడేవాడే వికసిస్తాడు అని. క్రీడలు మనల్ని ఏకం చేస్తాయి. జెర్సీ ఏదైనా, పేరు వినగానే ఈ వ్యక్తి మన దేశం వాడు అని తెలిసినప్పుడు మనసులో ఒక తెలియని సంతోషం కలుగుతుంది” అని ప్రధాని తన మనసులోని మాటను పంచుకున్నారు.

భారతీయత అనేది ఒక గొప్ప సంస్కృతి అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సంతతి ప్రజలు తమ కర్మభూమి (తాము నివసించే దేశం) అభివృద్ధికి ప్రాణప్రదంగా కృషి చేస్తున్నారని ప్రధాని అన్నారు. అదే సమయంలో తమ మాతృభూమి మూలాలను ఎప్పటికీ మర్చిపోరని, ఈ లక్షణమే భారతీయులను ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. యువతకు వీరంతా స్ఫూర్తిదాయకమని, భారతీయతకు గ్లోబల్ అంబాసిడర్లుగా వీరు వ్యవహరిస్తున్నారని మోదీ అభినందించారు. ఇదే క్రమంలో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన భారత సంతతి ఆటగాడు యువరాజ్ సమ్రాను కూడా ఆయన అభినందించినట్లు వార్తలు వస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us