తూర్పుగోదావరిలో తూటాల కలకలం
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో తుపాకీ బుల్లెట్లు బయటపడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా తూటాలు పట్టుబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని పంగిడి ప్రాంతం వద్ద పోలీసులు సాధారణ వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని వద్ద నిషేధిత ఆయుధాలకు సంబంధించిన తూటాలు లభ్యమయ్యాయి. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అహ్మద్ సమీర్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. ఇతను గత ఏడేళ్లుగా జిల్లాలోని దేచెర్లలో నివాసముంటున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి నుంచి తొమ్మిది 9mm బుల్లెట్లు, ఆరు .315 బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో హుస్సేన్ విస్తుపోయే నిజాలు వెల్లడించాడు. తనకు ఈ బుల్లెట్లను ఆదిత్య రాజ్ అనే వ్యక్తి ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా, ఆదిత్య రాజ్ వద్ద ప్రమాదకరమైన ఆయుధాలు కూడా ఉన్నాయని సమాచారం ఇచ్చాడు. ఆదిత్య రాజ్‌పై ఇప్పటికే రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో పలు కేసులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న ఆదిత్య రాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరికి ఎక్కడి నుంచి ఆయుధాలు అందుతున్నాయి? ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం :
తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

