మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని వారసంతలో రైతు సారయ్య 1200 కిలోల టమాటాలను అమ్మకానికి తెచ్చారు. కనీసం ఐదు రూపాయల ధర కూడా పలకకపోవడంతో కొనుగోలుదారులు లేక ఆయన తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ట్రాలీ కిరాయి కూడా రాని పరిస్థితి ఏర్పడటంతో, సారయ్య తన పంటను ఉచితంగా పంపిణీ చేశారు.