ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ ఆఫర్: ఉచితంగా అమెరికాలో శిక్షణ!
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అరుదైన అవకాశం లభించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక 'ఫుల్‌బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్‌మెంట్' (Fulbright TEA) ప్రోగ్రామ్ కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన వారు అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఆరు వారాల పాటు ప్రత్యేక అకడమిక్ శిక్షణ పొందుతారు.
ఈ ఫెలోషిప్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. వీసా, రాను-పోను విమాన టికెట్లు, వసతి, భోజనం, హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు రోజువారీ అలవెన్స్‌ను కూడా అందిస్తారు. విశేషమేమిటంటే, ఈ శిక్షణ కాలాన్ని ప్రభుత్వం ఆన్ డ్యూటీ గా పరిగణిస్తుంది. ఈ అవకాశం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధించే టీచర్లకే అర్హత ఉంటుంది. కనీసం 5 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలి. ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, గణితం, సైన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులు బోధించే వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంగ్లీష్‌పై పట్టు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా టోఫెల్ పరీక్షలో కనీసం 45 శాతం మార్కులు సాధించాలి.
మరిన్ని వీడియోల కోసం :
తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

