ఫ్రీ ఫ్రీ.. అక్కడ టమాటాలు ఉచితం.. ఎగబడిన జనం
ఒకప్పుడు సెంచరీ కొట్టి సామాన్యుడిని ఊరించిన టమాటా.. ఇప్పుడు కనీస గిట్టుబాటు ధర లేక రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. మార్కెట్‌లో ధరలు పాతాళానికి పడిపోవడంతో, పంటను అమ్ముకోలేక, పారబోయలేక మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. చేతికి వచ్చిన పంటను ఉచితంగా పంపిణీ చేసి తమ ఆవేదనను చాటుకున్నారు.
కొత్తగూడ మండల కేంద్రంలో జరిగిన వారాంతపు సంతలో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన రైతులు సారయ్య, మోహన్, సురేందర్ తాము పండించిన టమాటాలను అమ్మకానికి తీసుకువచ్చారు. అయితే, మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ. 2 కూడా పలకకపోవడంతో వారు నివ్వెరపోయారు. కనీసం రవాణా ఖర్చులు కూడా వచ్చేలా లేకపోవడంతో, కోపంతో సుమారు 1200 కిలోల టమాటాలను అక్కడికక్కడే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. “టమాటాలు ఫ్రీ.. ఫ్రీ..” అని ప్రకటించగానే సంతకు వచ్చిన జనం సంచులు, బస్తాలతో ఒక్కసారిగా ఎగబడ్డారు. నిమిషాల్లోనే ట్రాలీ ఖాళీ అయిపోయింది. ప్రజలు సంతోషంగా టమాటాలు తీసుకెళ్తున్నా, పండించిన రైతు కళ్లల్లో మాత్రం విషాదం కనిపించింది. పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?
ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!
టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

