AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : మాజీ భార్యకు హార్దిక్ పాండ్యా భారీ గిఫ్ట్.. కారు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Hardik Pandya : హార్దిక్ పాండ్యా చేసిన ఒక పని సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్, కుమారుడు అగస్త్య పాండ్యాకు ఏకంగా రూ. 4 కోట్ల విలువైన లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Hardik Pandya : మాజీ భార్యకు హార్దిక్ పాండ్యా భారీ గిఫ్ట్.. కారు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Hardik Pandya Gift
Rakesh
|

Updated on: Feb 22, 2026 | 2:40 PM

Share

Hardik Pandya : సినిమా కష్టాలైనా, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులైనా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా పాండ్యా చేసిన ఒక పని సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్, కుమారుడు అగస్త్య పాండ్యాకు ఏకంగా రూ. 4 కోట్ల విలువైన లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2024లో నటాషాతో విడిపోయినప్పటికీ, తండ్రిగా తన బాధ్యతను పాండ్యా మర్చిపోలేదని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హార్దిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్యకు ల్యాండ్ రోవర్ డెఫెండర్ కారును బహుమతిగా ఇచ్చారు. నటాషా, అగస్త్య ఈ కొత్త కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కారు డెలివరీ తీసుకునే చోట వెనుక ఉన్న బ్యానర్‌పై పాపా నుంచి అగస్త్యకు గిఫ్ట్ అని రాసి ఉంది. విడాకుల తర్వాత కూడా తన మాజీ భార్య, కొడుకు సంక్షేమం గురించి ఆలోచిస్తూ హార్దిక్ ఒక ‘జెంటిల్‌మెన్’ అనిపించుకుంటున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

నటాషాతో విడిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బాలీవుడ్ నటి మహికా శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 కోసం హార్దిక్ వెంటే మహికా కూడా ఉంది. ఇటీవల టీమ్ హోటల్‌లోనే ఆమె పుట్టినరోజును హార్దిక్ ఘనంగా సెలబ్రేట్ చేశాడు. అంతేకాదు, ఆమె పేరులోని మొదటి అక్షరాన్ని హార్దిక్ తన శరీరంపై ట్యాటూగా కూడా వేయించుకోవడం గమనార్హం. ఒకవైపు పర్సనల్ లైఫ్, మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్‌ను హార్దిక్ బ్యాలెన్స్ చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.

వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే, హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో పవర్‌ప్లేలోనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. బ్యాటింగ్‌లోనూ నమీబియాపై 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన సత్తా చాటాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 5 వికెట్లు పడగొట్టాడు. ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న సూపర్-8 కీలక పోరులో హార్దిక్ పాత్ర అత్యంత కీలకం కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us