- Telugu News Photo Gallery Technology photos Best budget smartphones under rs 10000 top picks for performance details in telugu
Best Budget Phones: బడ్జెట్ ఫోన్స్‌కు పెరుగుతున్న క్రేజ్.. టాప్-5 ఫోన్స్ ఇవే..!
భారతదేశంలోని యువత ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్స్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. అయితే దేశంలో ఎక్కువ మంది ప్రజలు మధ్యతరగతికి చెందిన వారు కావడంతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10 వేల తక్కువ ధరలో అందుబాటులో ఉన్న టాప్ స్మార్ట్ ఫోన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Apr 06, 2025 | 4:30 PM

మోటరోలా జీ05 స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6,990కు అందుబాటులో ఉంది. మీడియాటెక్ హీలియో జీ81 చిప్‌సెట్ ఆధారంగా పని చేసే ఈ ఫోన్ గొరిల్లా గ్లాస్-2 ప్రొటెక్టెడ్ 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఆకట్టుకుంటుంది. ఐపీ 54 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌తో పాటు 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.

మోటరోలా జీ35 5జీ స్మార్ట్ ఫోన్ టాప్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్‌గా ఉంది. రూ.9999కే అందుబాటులో ఉండే ఈ ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే యూనిసాక్ టీ760 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 50 ఎంపీ డ్యూయల్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడంతో పనితీరు బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

రియల్‌మీ సీ61 స్మార్ట్‌ఫోన్ రూ.10 వేలలోపు ధరలో దొరికే బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఇది అధిక-రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లేతో పాటు రోజంతా ఉపయోగించడానికి అతిపెద్ద బ్యాటరీతో వచ్చే సొగసైన స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్‌లో రియల్‌మీ యూఐ ద్వారా పని చేస్తుంది. సాధారణ గేమింగ్‌తో పాటు రోజువారీ పనులకు ఈ స్మార్ట్‌ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

రెడ్‌మి ఏ4 5జీ ఫోన్ రూ.8499 ధరకే అందుబాటులో ఉంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే 5జీ ఫోన్‌గా ఈ ఫోన్ రికార్డు చేజిక్కించుకుంది. మీడియాటెక్ చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 50 ఎంపీ ప్రధాన కెమెరాతో భారీ బ్యాటరీ ఉంటుంది. అందువల్ల రోజువారీ పనితీరులో మెరుగ్గా ఉంటుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ స్మార్ట్ ఫోన్ సామ్‌సంగ్ ఫోన్ లవర్స్‌కు బడ్జెట్‌లో అందుబాటులో ఉండే సూపర్ స్మార్ట్ ఫోన్. రూ.9,199 ధరలో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లో పెద్ద డిస్‌ప్లే, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్, సాధారణ ఫోటోగ్రఫీ అవసరాలకు సరిపోయే కెమెరాలతో ఆకర్షిస్తుంది. అధునాత ఫీచర్లతో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ ప్రత్యేకతగా నిలుస్తుంది.




