AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కాలేజీ ఫేర్వెల్‌ పార్టీలో ప్రసంగిస్తూ కుప్పకూలిన విద్యార్ధిని.. షాకింగ్‌ వీడియో చూశారా?

నేటి కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అప్పటి వరకూ కళ్ల ముందు హాయిగా నవ్వుతూ కనిపించిన వాళ్లు ఒక్క క్షణంలోనే అనంత లోకాలకు చేరువవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా ఇలా మృత్యువడికి చేరడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా అటువంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది..

Viral Video: కాలేజీ ఫేర్వెల్‌ పార్టీలో ప్రసంగిస్తూ కుప్పకూలిన విద్యార్ధిని.. షాకింగ్‌ వీడియో చూశారా?
Student Collapses During College Farewell Speech
Srilakshmi C
|

Updated on: Apr 06, 2025 | 4:55 PM

Share

ధరాశివ్ , ఏప్రిల్ 6: అప్పటి వరకు కోలాహలంగా సాగిన కాలేజీ ఫేర్‌వెల్‌ పార్టీలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. స్టేజ్‌పై ప్రసంగిస్తున్న విద్యార్ధిని ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించింది. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

మృతురాలిని పరందలోని ఆర్‌జి షిండే కళాశాలకు చెందిన వర్ష ఖర్రత్‌ (20)గా గుర్తించారు. ఘటనకు ముందు ఆమె స్టేజ్‌పై నవ్వుతూ ప్రసంగించడం వీడియోలో చూడొచ్చు. ఉన్నట్లుండి ఆమె ఒక్కసారిగా కుప్పకూలడంతో విద్యార్ధులంతా ఆమెను హుటాహుటీన పరాండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మరణించినట్లు ప్రకటించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వర్షకు 8 యేళ్ల వయసులో గుండె శస్త్రచికిత్స జరిగింది. కానీ గత పన్నెండు సంవత్సరాలుగా ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కనిపించలేదు. అప్పటి నుంచి ఆమె ఎటువంటి మందులు తీసుకోకపోయినా ఎంతో ఆరోగ్యంగా ఉంది. అయితే వర్ష కాలేజీ ఫంక్షన్‌లో ప్రసంగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందింది.

ఇవి కూడా చదవండి

విద్యార్ధిని వర్ష మృతి పట్ల కళాశాల యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఒక రోజు సెలవు ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..