వేసవిలో పనస పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలుసుకోండి..
ప్రపంచంలోనే అతిపెద్ద పండుగా పిలువబడే పనసలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పనస తొనలు తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు దూరమవుతాయి. దీని వాసన, తొనల రుచి మనలో తినాలన్న కోరికను పెంచుతాయి. పనస తొనల్లో ఫైబర్, విటమిన్ ఎ, సీ పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పనసపండు తొనలను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Updated on: Apr 06, 2025 | 1:06 PM

పనసలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. పనసకాయ వేసవిలో తింటే జీర్ణ సమస్యలు, విరేచనాలు, ఉబ్బరం వస్తాయి. కొందరికి పనసకాయ తింటే అలెర్జీ వస్తుంది. దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి.

డయాబెటిస్ పేషెంట్లు కూడా పనస పండును తినకపోవడం మంచిది. పనసలో చక్కెర శాతం ఎక్కువ. కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు జాగ్రత్తగా తీసుకోవాలి. సర్జరీకి ముందు, తర్వాత పనస తినకూడదు. తింటే విరేచనాలు, జీర్ణ సమస్యలు వస్తాయి.

కిడ్నీ సమస్యలు ఉంటే పనస తినకూడదు. ఇందులో పొటాషియం ఎక్కువ. దీనివల్ల సమస్య పెరుగుతుంది. పనసపండు తినడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయట. అందుకే గర్భిణులు తినకూడదు. అలాగే బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా తినకూడదు. ఈ విషయంలో తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

పనస పండులో ఉండే పొటాషియం కిడ్నీ సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు పనసపండును తినకూడదు. పనస తొనలను అతిగా తింటే జీర్ణం కావడం కష్టం. దీని వల్ల కడుపు నొప్పి, ఇతర ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కొందరు తరచుగా అలర్జీల బారిన పడుతుంటారు. వీరు పనస పండును తింటే ఈ లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉంది. శ్వాస సమస్యలతో ఇబ్బందిపడేవారు కూడా ఈ ఫలానికి దూరంగా ఉండటం మంచిది. అందుకే ఆరోగ్యంగా ఉన్నవారైనా సరే వీటిని మితంగా తినడం మంచిది.





























