వీళ్లు మాత్రం బాదం పప్పులను పొరపాటున కూడా తినకూడదు.. లేదంటే అంతే సంగతి..!
అన్ని డ్రైఫ్రూట్స్‌లో కెల్లా బాదంకు ప్రత్యేక స్థానం ఉంటుంది. బాదం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం బాదం పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు బాదం తినడం వల్ల ప్రయోజనం కన్నా ఎక్కువ నష్టమే కలుగుతుందని సూచిస్తున్నారు. ఎవరు బాదం తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 06, 2025 | 1:18 PM

హైబీపీ పేషెంట్లు బాదం పప్పును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ మందులను వాడుతూ బాదం పప్పులను తినడం చాలా డేంజర్ అంటున్నారు. ఈ అధిక రక్తపోటు కారణంగా హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి.

బాదంలో చాలా కొద్ది మొత్తంలో సైనైడ్ ఉంటుంది. ఎక్కువగా తింటే ప్రమాదం తప్పదు. బాదంలో విటమిన్-ఈ కొద్ది మొత్తంలో మాత్రమే శరీరానికి అవసరం. ఎక్కువైతే అలెర్జీలు వస్తాయి ఒకేసారి ఎక్కువ బాదం పప్పు తింటే జీర్ణవ్యవస్థలో అసౌకర్యం ఏర్పడుతుంది.

బాదం పప్పులో ఫైటిక్ యాసిడ్ ఒక యాంటీ-న్యూట్రియెంట్. విటమిన్లు, ఖనిజాల శోషణను తగ్గిస్తుంది. బాదం పప్పులో ఆక్సలేట్‌లు ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది బాదం పప్పులో కొవ్వులు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే!

బాదం పప్పులను అమితంగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది వ్యక్తులకు బాదం అలెర్జీ ఉంటుంది. మోతాదుకు మించి తీసుకుంటే వారు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా బాదంపప్పులు తినడం మంచిది కాదు

మైగ్రేన్ తో బాధపడేవారు బాదం తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. మైగ్రేన్ లేదా తలనొప్పి ఉన్నప్పుడు బాదం తింటే ఈ సమస్య మరింత పెరుగుతుంది. మైకం, వికారం, వాంతులు, అలసట వంటి సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.




