భోజనం చేసిన వెంటనే చేసే కొన్ని పొరపాట్ల కారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, తద్వారా లేనిపోని అనారోగ్యాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
ముఖ్యంగా కొందరు భోజనం తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. అలాంటి వారు ఈ అలవాటును మానుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు
TV9 Telugu
సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి తగిన శక్తి, పొట్టకు సరైన రక్తప్రసరణ అవసరం. అయితే స్నానం రక్తప్రసరణపై ప్రభావం చూపి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుందట
TV9 Telugu
ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు
TV9 Telugu
భోజనం చేసిన వెంటనే కొంతమందికి టీ లేదా కాఫీ తాగే అలవాటుంటుంది. అయితే దీనివల్ల మనం తీసుకున్న ఆహారంలోని వివిధ పోషకాలను శరీరం గ్రహించే శక్తి క్షీణిస్తుందని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
పండ్లను భోజనం చేసిన తర్వాత కన్నా.. బ్రేక్‌ఫాస్ట్‌గా, మిడ్‌మీల్‌గా (అల్పాహారం, లంచ్‌కి మధ్యలో), అదీ కాదంటే సాయంత్రం స్నాక్‌గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు
TV9 Telugu
ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే నిద్ర పోవడం అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల బరువు విపరీతంగా పెరిగి ఉభకాయానికి దారి తీస్తుంది
TV9 Telugu
అయితే ఒక్కొక్కరి ఆరోగ్య స్థితి, శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది.. కాబట్టి ఈ సమస్యలన్నీ అందరిలోనూ తలెత్తాలని లేదు. ఒకవేళ ఈ అలవాట్ల కారణంగా ఆరోగ్యంలో ఏదైనా అసౌకర్యం కలిగినట్లనిపిస్తే వెంటనే వాటిని ఆపేయాలి