వయసును కువకువలాడించే వెన్న పండు..

22  February 2026

TV9 Telugu

TV9 Telugu

ముదురురంగు కాయగూరల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో అవకాడో కూడా కీలకమైనది. వెన్న పండుగా పిలిచే అవకాడో మేని ఛాయను పెంటి వయసు కువకువలాడేలా చేస్తుంది 

TV9 Telugu

గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో అవ‌కాడోలు ఒక‌టి. ఇవి క్రీమి టెక్స్చర్ తో చాలా రుచిగా ఉంటాయి. అవ‌కాడోలో ఆరోగ్యక‌ర‌మైన కొవ్వులు, ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోష‌కాలు ఉంటాయి

TV9 Telugu

వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు మొత్తం శ‌రీర ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. వీటిల్లో హృద‌య‌నాళ స‌మ‌తుల్యత‌ను ప్రోత్సహించే బ‌యోయాక్టివ్ స‌మ్మేళ‌నాలు ఉంటాయి

TV9 Telugu

అవ‌కాడోలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిల‌కు మ‌ద్దతును ఇస్తాయి. దీనిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణక్రియ‌ను మెరుగుప‌రుస్తుంది

TV9 Telugu

ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, చ‌క్కెర స్థాయిల‌ను నిర్వహించ‌డంలో ఇది ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అవ‌కాడోలో ఉండే పొటాషియం ర‌క్తపోటును త‌గ్గించ‌డంలో, సోడియం ప్రభావాల‌ను స‌మ‌తుల్యం చేయ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది

TV9 Telugu

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించి వాపుతో పోరాడ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అవ‌కాడో గుండె ల‌య‌కు అవ‌స‌ర‌మయ్యే ఫోలేట్, మెగ్నీషియంల‌ను కూడా క‌లిగి ఉంటుంది

TV9 Telugu

వీటిని క్రమం త‌ప్పకుండా తీసుకోవ‌డం వ‌ల్ల ఎండోథెలియ‌ల్ ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ర‌క్తనాళాలు వ్యాకోచం చెందే సామ‌ర్థ్యం పెరుగుతుంది. హృద‌యనాళ వ్యవ‌స్థపై ఒత్తిడి త‌గ్గుతుంది

TV9 Telugu

అవ‌కాడోల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తనాళాల ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు అడ్డంకులు ఏర్పడ‌డాన్ని త‌గ్గిస్తుంది. ఆరోగ్యక‌ర‌మైన లిపిడ్ ప్రొఫైల్ నిర్వహించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. ఇది బెస్ట్ యాంటీ ఏజింగ్‌ ఫుడ్‌ కూడా. వయసును వెనక్కి నెట్టే పోషకాలు ఇందులో దండిగా ఉన్నాయి