Video: కృష్ణనదిలో దూకిన మహిళ.. సినిమాను తలపించిన రెస్క్యూ ఆపరేషన్!
కుటుంబ కలహాలతో ఒక మహిళ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. NDRF సభ్యులు వెంటనే స్పందించి, డ్రోన్లు, వాటర్ బెలూన్లను ఉపయోగించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. బోట్లు తిరగబడినా, NDRF సభ్యులు మహిళను రక్షించారు. తర్వాత పోలీసులు ఆమెకు, కుటుంబానికి కౌన్సిలింగ్ అందించారు.
కృష్ణానదిలో దూకిన మహిళను NDRF సభ్యులు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి రక్షించారు. కుటుంబకలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణనదిలోకి దూకేసింది. మహిళ దూకుతుండగా చూసిన NDRF సభ్యులు వెంటనే యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. డ్రోన్లు, వాటర్ బెలూన్లు వాడి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, మహిళను ప్రాణాలతో రక్షించారు. ఈ ఘటనపై కుటుంబీకులను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా, ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుపుతుండగా.. NDRF బోట్లు కూడా తిరగబడ్డాయి. అయినా ఈదుతూ వెళ్లి మహిళను కాపాడారు. ఆ తర్వాడ డ్రోన్ల సాయంతో వాటర్ బెలూన్లు పంపి ఆమెను పూర్తిగా ఒడ్డుకు తీసుకొచ్చారు.
వైరల్ వీడియోలు
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

