పుచ్చకాయ వీరికి విషంతో సమానం.. తిన్నారో కథ కంచికే!
09 April 2025
TV9 Telugu
TV9 Telugu
వేసవి పండు పుచ్చకాయ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. ఇందులో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. దీంతో ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఒక అద్భుతమైన మార్గంగా పని చేస్తుంది
TV9 Telugu
పుచ్చకాయలో ఎ, సి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, పీచు, క్యాల్షియంలు విస్తారంగా ఉన్నందున ఇది మంచి పోషకాహారం. శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. మంట, తాపాలను తగ్గిస్తుంది
TV9 Telugu
ఇందులో ఉన్న ఎ-విటమిన్ కంటిచూపును మెరుగుపరిస్తే, సి-విటమిన్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఈ కాలంలో తరచుగా పుచ్చకాయ తినడం వల్ల గొంతు తడారిపోవడం, ఒంట్లో నీరు ఇంకిపోవడం, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తవు
TV9 Telugu
కానీ పుచ్చకాయ అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. అవును.. కొంతమంది ఎక్కువగా పుచ్చకాయ తింటే అది వారికి మేలుకు బదులు హానికరంగా మారుతుంది
TV9 Telugu
ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయను మితంగా తినాలి. అలాగే కడుపులో నీరు నిలుపుకునే సమస్య ఉన్నవారు కూడా పుచ్చకాయను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి
TV9 Telugu
పుచ్చకాయలో సహజ చక్కెర చాలా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా ఇది రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్న రోగులు పుచ్చకాయను తక్కువగా తినాలి
TV9 Telugu
ఎవరికైనా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పుచ్చకాయలో ఉండే ఫ్రక్టోజ్ వారి కడుపును మరింత కలవరపెడుతుంది. ఇది ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలకు కారణమవుతుంది
TV9 Telugu
ఆయుర్వేదం ప్రకారం పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను పెంచుతుంది. పుచ్చకాయలో పొటాషియం ఉంటుంది. ఇది కిడ్నీ రోగులకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం సమతుల్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి