AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: గుండె ఆరోగ్యాన్ని కాపాడే 7 డ్రై ఫ్రూట్స్.. ఇవి తింటే మీ గుండె సేఫ్..!

గుండె ఆరోగ్యం కోసం ప్రతి రోజు తీసుకునే ఆహారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ను మన ఆహారంలో చేర్చుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. పోషకాలతో నిండిన ఈ డ్రై ఫ్రూట్స్‌ను ప్రతి రోజు కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Heart Health: గుండె ఆరోగ్యాన్ని కాపాడే 7 డ్రై ఫ్రూట్స్.. ఇవి తింటే మీ గుండె సేఫ్..!
Dry Fruits
Prashanthi V
|

Updated on: Apr 10, 2025 | 1:44 PM

Share

ప్రస్తుత రోజుల్లో అధిక మానసిక ఒత్తిడి, తినే ఆహారం సరైన విధంగా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ప్రతి రోజు కొద్దిగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు అలాంటి ముఖ్యమైన 7 డ్రై ఫ్రూట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

వాల్‌నట్స్‌ మన గుండెకు కావలసిన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా కలిగి ఉంటాయి. ఇవి గుండెకు మంచిగా పనిచేస్తూ శరీరంలో వాపులను తగ్గిస్తాయి. వాల్‌నట్‌ తినడం వల్ల రక్త నాళాల ఆరోగ్యం మెరుగవుతుంది.. ఇది గుండె సంబంధిత సమస్యలు రావడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నందున ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి హృదయానికి రక్షణ కల్పిస్తాయి.

బాదాంలో విటమిన్-ఇ, మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతి రోజు 5-6 బాదాం పప్పులు తినడం వల్ల గుండె పని తీరు మెరుగవుతుంది. అంతేగాక ఇవి గ్లూకోజ్ స్థాయిలను కూడా నియంత్రించగలవు.

చిన్నదిగా కనిపించే ఎండు ద్రాక్షలు పెద్ద ప్రయోజనాలను ఇస్తాయి. వీటిలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండెకు మంచివిగా పనిచేస్తాయి. పొటాషియం కూడా పుష్కలంగా ఉండటంతో రక్తపోటు నియంత్రణలో ఇవి సహాయపడతాయి. అలాగే ఇవి గుండెపై ఒత్తిడిని తగ్గించే గుణం కలిగి ఉన్నాయి.

ఆప్రికాట్‌లలో ఫైబర్, విటమిన్-ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె నాళాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. ఫలితంగా గుండెకు రక్తప్రవాహం సజావుగా జరుగుతుంది. ఆహారంలో ఆప్రికాట్‌ను చేర్చడం గుండె ఆరోగ్యానికి మంచిది.. ఇతర శారీరక వ్యవస్థలకు కూడా మేలు చేస్తుంది.

డేట్స్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది.. ఇది రక్తపోటును సమతుల్యంలో ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే ఇవి ప్రాకృతిక చక్కెరలను కలిగి ఉండటంతో శక్తిని ఇస్తాయి. గుండెపోటు, రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గించే గుణాలు డేట్స్‌లో ఉంటాయి. రోజు ఒకటి లేదా రెండు ఖర్జూరాలు తీసుకుంటే చాలు.

పిస్తా పప్పులు ఒమేగా-3 ఫ్యాట్స్‌తో పాటు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచి గుండెకు మద్దతు ఇస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజుకు అరగంట నానబెట్టిన 5-6 పిస్తా తినడం మంచిది.

జీడిపప్పులో మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు ఉండటంతో ఇవి గుండెకు మేలు చేస్తాయి. ఇవి శరీరంలో రక్తప్రవాహాన్ని మెరుగుపరిచి, హృదయ సంబంధిత సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే వీటిలో కొవ్వు ఎక్కువగా ఉండటంతో తగిన పరిమితిలో మాత్రమే తీసుకోవడం మంచిది. ఇవన్నీ సహజంగా లభించే ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌. వీటిని ప్రతి రోజు కొద్దిగా తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
స్థిరంగా బంగారం ధరలు.. అక్టోబర్ 11న తులం ఎంతంటే..?
స్థిరంగా బంగారం ధరలు.. అక్టోబర్ 11న తులం ఎంతంటే..?
సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!
సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!