ఆవాలతో ఆరు ప్రయోజనాలు.. మీ డైట్లో ఇవి ఉంటే ఎంత మేలో..
samatha
9 april 2025
Credit: Instagram
ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ వీటితో బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆవాలను వంటల్లో ఉపయోగించడం వలన రుచిని ఇవ్వడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి కాపాడుతాయంట. కాగా వీటి వలన కలిగే లాభాలు ఏవో చూద్దాం.
ఆవాలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతాయంట.
చర్మం ఆరోగ్యానికి ఇవి చాలా మంచిదంట. ఇందులో ఉండే జింక్ వంటి ఖనిజాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా సహజమైన మెరుపునిస్తాయంట.
ఆవాలు మన ఆహారంలో చేర్చుకోవడం వలన ఇవి జీర్ణ ఎంజైమ్ లను ప్రేరపించి, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి దోహదం చేస్తాయంట. ఇదులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుందంట.
ఆవాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయంట. అలాగే ఆరోగ్యాన్ని మెరుగు పరిచి శరీరానికి శక్తిని అందిస్తాయంట.
దీర్ఘకాలిక వాపు ఆర్థరైటిస్, గుండె జబ్బుల వంటి సమస్యలతో బాధపడుతున్నవారు వీటి ఆహారంలో చేర్చుకోవడం వలన కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయంట.
ఆవ గింజల్లో గుండె ఆరోగ్యానికి కీలకమైన ఒమేగా-3 ,ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ఫైబర్‌తో కలిపి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.