తమల పాకులు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు అవి ఏవో తెలుసుకుందాం.
తమలపాకులను వాటి యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాల కలిగి ఉన్నాయి. దీంతో ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, దుర్వాసనను తగ్గించడంలో శ్వాసకోశ వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడతాయి.
తమలపాకులు భోజనం తర్వాత తినడం చాలా మంచిది. దీనిని తిన్న తర్వాత తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేసి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
తమలపాకులను ప్రతి రోజూ తీసుకోవడం వలన పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా నుంచి కాపాడటమే కాకుండా, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యతో బాధపడేవారికి ఇది బెస్ట్ మెడిసన్. దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చును.
తమలపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటి ఇన్ఫెక్షన్లను నివారించి, నోటిని శుభ్రంగా ఉంచుతాయి. నోటి దుర్వాసనను తొలగించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
అదే విధంగా తమల పాకులను నమలడం వలన నాడీ వ్యవస్థ బాగుంటుంది. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను కలిగిస్తాయి.
ముఖ్యంగా రాత్రి వేళల్లో తమలపాకులు తినడం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. తమలపాకులు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటికి పంపడంలో సహాయపడతాయి. ఇవి శరీర శుద్ధి ప్రక్రియలో సహాయకరంగా ఉంటాయి.