మీరూ భోజనంలో నెయ్యి తింటారా? వేసవిలో కాస్త కొసరడం బెటర్..
09 April 2025
TV9 Telugu
TV9 Telugu
వేడివేడి అన్నంలో కాస్త పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఉంటుందీ..! మాటల్లో వర్ణించలేని అనుభూతి. కానీ ఇప్పుడంతా కెలొరీల లెక్కే. అందుకే కాస్త ఘాటెక్కువగా ఉన్న కూరలో రెండు చుక్కల నెయ్యి వేస్తానన్నా వద్దనేస్తున్నాం
TV9 Telugu
కానీ, రోజూ రెండు చెంచాల ఆవునెయ్యి తింటే మేలంటున్నాయి పలు అధ్యయనాలు. నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు సైతం చెబుతున్నారు
TV9 Telugu
నిజానికి, నెయ్యి ఒక సూపర్ ఫుడ్. ఇది శరీరంలో శక్తిని నిలుపుకుంటుంది. తిన్నది త్వరగా జీర్ణమయ్యేలా చేయడమే కాదు.. గ్యాస్ సంబంధిత సమస్యలనూ దరి చేరనివ్వదు
TV9 Telugu
నెయ్యిలో పోషకాల మోతాదూ ఎక్కువేనట. ముఖ్యంగా కంటిచూపుని మెరుగుపరిచే విటమిన్ ఎ ఇందులో పుష్కలంగా దొరుకుతుంది. అంతేకాదు, దీని నుంచి మనకి అందే మంచి కొవ్వులు, విటమిన్ ‘ఇ’ కాలేయాన్ని కాపాడుతుంది. హర్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది
TV9 Telugu
అయితే వేసవిలో నెయ్యి ఎంత తినచ్చో లేదోనని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. నిపుణులు ఏం చెబుతున్నారంటే.. వేసవిలో ఒకటి లేదా రెండు చెంచాల నెయ్యి తినడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు
TV9 Telugu
నెయ్యిలో ఆక్సిడైజ్డ్ అనే సంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఒలీక్ ఆమ్లం ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి
TV9 Telugu
అలాగే నెయ్యిలో తగినంత మొత్తంలో విటమిన్ కె లభిస్తుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. వేసవి కాలంలో జీర్ణ సమస్యలు తరచుగా మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి
TV9 Telugu
మీకు ఎప్పుడైనా కాస్త కడుపు నొప్పిగా ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తినేయండి. అంతే కడుపు వెంటనే క్లీన్ అయిపోతుంది