పాలు తాగితే ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయా..?
23 February 2026
TV9 Telugu
TV9 Telugu
ఆరోగ్యానికి మేలు చేసే పాలు.. ఎముకలు, కండరాలను బలంగా ఉంచడానికి చాలా అవసరం. అయితే అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారికి పాలు తీసుకోవడం మంచిదేనా? దీని వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ మరింత పెరుగుతుందా? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి
TV9 Telugu
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె సమస్యలకు కారణమవుతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది
TV9 Telugu
నిజానికి పాలు జంతు సంబంధిత ఆహారం కాబట్టి ఇందులో కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేసే కొవ్వులు ఉంటాయి. అయితే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడే వారు పాలను పూర్తిగా మానేయవల్సిన అసవరం లేదు
TV9 Telugu
శరీర ఆరోగ్యాన్ని బట్టి అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను బట్టి పాలను పరిమితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
అధిక కొలెస్ట్రాల్ ధమనుల్లో ఫలకాలు ఏర్పడేలా చేస్తాయి. దీన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇరుకుగా చేసి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది
TV9 Telugu
అందుకే రక్తంలో ఎల్లప్పుడు 200 DL కంటే తక్కువ కొలెస్ట్రాల్ ఉండాలి. అయితే పాలల్లో ఉండే కొవ్వు పదార్థాన్ని బట్టి కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రభావం పడుతుంది. సంతృప్త కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి
TV9 Telugu
బదులుగా తక్కువ కొవ్వు కలిగి ఉండే మొక్కల ఆధారిత పాలు తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. బాదం పాలు, సోయా పాలు, ఓట్స్ పాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ శోషణ తగ్గుతుంది
TV9 Telugu
గేదె పాలలో 8 నుండి 10 శాతం కొవ్వు ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగతాయి. కనుక అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారు ఆవు పాలను పరిమితంగా తీసుకోవచ్చు