AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..! అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు రద్దు.. ఎందుకంటే..?

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తి అయినా.. శ్రీమల్లిఖార్జున ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో స్వామి, అమ్మవార్ల మామూలు అర్జిత, అభిషేకాలు కూడా అధికారులు రద్దు చేశారు.

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..! అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు రద్దు..  ఎందుకంటే..?
Srisailam Temple
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Feb 23, 2026 | 10:52 AM

Share

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తి అయినా.. శ్రీమల్లిఖార్జున ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో స్వామి, అమ్మవార్ల మామూలు అర్జిత, అభిషేకాలు కూడా అధికారులు రద్దు చేశారు.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భక్తులు పోటెత్తారు క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మల్లన్నస్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులతో క్షేత్రమంత జనసంద్రంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువ జామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శించుకంటున్నారు. క్యూలైన్స్‌లో దర్శన కంపార్టుమెంట్లలో భక్తులు భారీగా బారులు తీరారు. శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.

మరోపక్క భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో అన్ని ఆర్జిత, అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సామాన్య భక్తులకు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో విఐపి బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 2 విడతలుగా దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం 7:30 రాత్రి 9 గంటలకు మాత్రమే బ్రేక్ స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు అధికారులు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

చంద్రగ్రహణం ప్రభావం..!

చంద్రగ్రహణం ప్రభావం దృష్ట్యా మార్చి 3వ తేదీన శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం మూసివేయనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు. గ్రహణ వేళలో ఆలయ ద్వారాలు, ఉపాలయాలు మూసివేయడంతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ముందస్తుగా ఈ మార్పులను గమనించి తమ దర్శన ప్రణాళికలు చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ప్రధాన ఆలయ ద్వారాలు పూర్తిగా మూసివేయనున్నారు.

అయితే తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు యథావిధిగా నిర్వహిస్తారు. ఉదయం 4:30 నుంచి 5:30 వరకు మాత్రమే భక్తులకు అలంకార దర్శనం కల్పించనున్నారు. గ్రహణ సమయం ముగిసిన అనంతరం రాత్రి 7:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత్రి 9 గంటల నుంచి 10:30 గంటల వరకు భక్తులకు తిరిగి దర్శనావకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఇక, ప్రముఖ పరివార ఉపాలయాలు కూడా గ్రహణం సమయంలో మూసివేయనున్నట్లు వెల్లడించారు. దీంతో శ్రీశైల క్షేత్రంలోని అన్ని ఆలయాల్లో సేవలు గ్రహణ వేళల్లో పూర్తిగా నిలిచిపోనున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు