ఛీ.. ఛీ.. అసలు నువ్వు తల్లివేనా.. కన్న కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి ప్రియుడితో..
రోజురోజుకు మానవ సంబంధాలు మరింత దారుణంగా దిగజారుతున్నాయి.. వివాహేతర సంబంధాలు, శారీరక వాంఛల కోసం కన్నవారు, తోడబుట్టినవారు.. అని లేకుండా ప్రవర్తిస్తూ.. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా.. ఓ తల్లి.. అత్యంత దారుణంగా ప్రవర్తించింది.. కన్న కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి ప్రియుడితో అత్యాచారం చేయించింది..

రోజురోజుకు మానవ సంబంధాలు మరింత దారుణంగా దిగజారుతున్నాయి.. వివాహేతర సంబంధాలు, శారీరక వాంఛల కోసం కన్నవారు, తోడబుట్టినవారు.. అని లేకుండా ప్రవర్తిస్తూ.. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా.. ఓ తల్లి.. అత్యంత దారుణంగా ప్రవర్తించింది.. కన్న కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి ప్రియుడితో అత్యాచారం చేయించింది.. ఈ దారుణ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై సాలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాచ్‌మెన్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, 20 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అతను.. వారానికి ఒకసారి మాత్రమే ఇంటికి వెళ్తుంటాడు.. ఈ నేపథ్యంలో భార్య.. ఆ ప్రాంతంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని పిలిపించుకుంటూ సరసాల్లో మునిగిపోయేది.. ఇది గమనించిన.. కుమార్తె.. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని.. తల్లిని మందలించింది. తల్లి ఎంతకూ వినకపోవడంతో ఆమెతో మాట్లాడటం మానేసింది. ఈ క్రమంలో గత నెల 3వ తేదీన అనారోగ్యంతో ఉన్న కుమార్తెకి తల్లి నిద్రమాత్రలు ఇచ్చింది.. అనంతరం ప్రియుడిని పిలిపించి అత్యాచారం చేయించింది.
23వ తేదీన.. మళ్లీ యువతికి నిద్రమాత్రలు ఇచ్చిన తల్లి .. లవర్ ను పిలిపించి అత్యాచారానికి పాల్పడేలా చేసింది. ఈ క్రమంలోనే.. స్పృహలోకి వచ్చిన యువతి పెద్దగా కేకలు వేసింది.. దీంతో ఆమెను గదిలో బంధించి.. బయటకు చెప్పకూడదంటూ బెదిరించారు. ఆ తర్వాత.. ఇంటినుంచి తప్పించుకున్న యువతి తిరువణ్ణామలైలో ఉన్న బంధువు ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పి విలపించింది.
ఈ క్రమంలోనే.. కడుపునొప్పితో బాధపడుతున్న యువతిని బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ యువతి కుటుంబసభ్యులు.. సెయ్యారు మహిళా పోలీసు స్టేషన్‌లో తల్లి, ఆమె ప్రియుడు దక్షిణామూర్తి(50) పై ఫిర్యాదు చేశారు. ఘటన జరిగింది వడపళనిలో కావడంతో వడపళని ఆల్ ఉమెన్ పోలీస్‌స్టేషన్‌కి కేసుని బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
