శ్రీరామనవమి రోజున అస్సలే ఈ పనులు చేయకూడదంట.. చేస్తే ఇక అంతే!

samatha 

5 april 2025

Credit: Instagram

శ్రీరామ నవమి అంటే ఎంతో శుభ ప్రదమైన రోజు. ఈ రోజు రామ భక్తులందరూ ఉదయాన్నే లేచి, కల్లాపి చల్లి నిష్టగా రామయ్యను పూజిస్తారు..

అంతే కాకుండా దగ్గరిలోని రామాలయానికి వెళ్లి  సీతారాములను దర్శించుకుంటారు. రాముల వారికి ఇష్టమైన ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెడుతారు.

అయితే ఈ సారి ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజున శ్రీరామ నవమిని జరుపుకోనున్నారు. అయితే ఈ రోజున కొన్ని పనులు అస్సలే చేయకూడదంటున్నారు పండితులు.

ఒక వేళ తెలిసి తెలియక ఈ పనులు చేశారో జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, శ్రీరామ నవమి రోజున చేయకూడని పనులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందు సంప్రదాయంలో శ్రీరామ నవమికి ఎంతో విషిష్టత ఉంది. అయితే ఇలాంటి గొప్ప రోజున  ఎట్టి పరిస్థితుల్లో మద్యంచ మాంసాహారం తినకూడదంట.

అంతే కాకుండా శ్రీరామ నవమి రోజును చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి, ఈరోజున జుట్టు కట్ చేసుకోవడం, గోర్లు తీసుకోవడం లాంటివి అస్సలే చేయకూడదంట.

అదే విధంగా, ఈ రోజున ఉతకని బట్టలు అస్సలే ధరించకూడదంట. వీలైనంత వరకు కొత్తబట్టలు ధరించడం మేలు అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

అలాగే శ్రీరామ నవమి రోజున వాగ్వాదానికి దిగడం, ఒకరి గురించి చెడుగా మాట్లాడటం, చెడుగా ఆలోచించడం వంటివి అస్సలే చేయకూడదంట.