AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ ఉన్న భారతీయులు వెంటనే దేశానికి రావాలి.. హెచ్చరించిన విదేశాంగ శాఖ

ఆఫ్రికన్ దేశంలోని నైగర్‌లో సైనిక తిరుగుబాటు కలకలం రేపింది. అయితే ఆ ప్రాంతంలో భారతీయులు కూడా ఉన్నారు. దీంతో భారతీయ పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశం విడిచి రావాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. ప్రస్తుతం నైగర్‌లోని పరిస్థితిని భారత ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎమ్‌ఈఓ ప్రతినిధి అరిందమ్ బాగ్జి తెలిపారు. అలాగే ప్రజలు నియామీకి ప్రయాణిస్తుంటే తమ ప్రణాళికలను కూడా మరోసారి ఆలోచించుకోవాలని కోరారు. ఆ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం లేనటువంటి భారతీయులు వీలైనంత త్వరగా దేశం విడిచి రావాలని సూచనలు చేశారు.

అక్కడ ఉన్న భారతీయులు వెంటనే దేశానికి రావాలి.. హెచ్చరించిన విదేశాంగ శాఖ
Niger
Aravind B
| Edited By: |

Updated on: Aug 14, 2023 | 6:18 AM

Share

ఆఫ్రికన్ దేశంలోని నైగర్‌లో సైనిక తిరుగుబాటు కలకలం రేపింది. అయితే ఆ ప్రాంతంలో భారతీయులు కూడా ఉన్నారు. దీంతో భారతీయ పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశం విడిచి రావాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. ప్రస్తుతం నైగర్‌లోని పరిస్థితిని భారత ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎమ్‌ఈఓ ప్రతినిధి అరిందమ్ బాగ్జి తెలిపారు. అలాగే ప్రజలు నియామీకి ప్రయాణిస్తుంటే తమ ప్రణాళికలను కూడా మరోసారి ఆలోచించుకోవాలని కోరారు. ఆ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం లేనటువంటి భారతీయులు వీలైనంత త్వరగా దేశం విడిచి రావాలని సూచనలు చేశారు. ప్రస్తుతం గగనతలం ముసివేయబడిందని వారు గుర్తుంచుకోచ్చని.. బయలుదేరాల్సి వచ్చినప్పుడు భూ సరిహద్దు ద్వారా భద్రతను నిర్ధారించేందుకు జాగ్రత్తలు తీసుకొవచ్చని పేర్కొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో నైగర్‌కు వెళ్లాలనుకునేవారు ప్రస్తతం అక్కడ ఉన్న పరిస్థితులు సాధరణ స్థితి వచ్చే వరకు వెళ్లకపోవడమే మంచిదని అన్నారు. తమ ప్రయాణ ప్లాన్స్‌ను పురనారాలోచించుకోవాలని కోరారు.

ఇదిలా ఉండగా నైగర్ రాజధాని అయిన నియామీ లోని భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోనటువంటి భారతీయ పౌరులు వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలని సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే భారతీయ పౌరులు నియామీలోని భారత రాయాబార కార్యాలయంలోకి అత్యవసరంగా వచ్చి అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. భారతీయులు 22799759975 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. అలాగే నైగర్‌లో ఎంతమంది భారతీయులు చిక్కుకున్నారు అని ప్రశ్న అడగగా.. దాదాపు 250 మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయినట్లు స్పష్టం చేశారు. అలాగే భారతీయ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని ఎమ్‌ఈఓ అభ్యర్థిస్తోందని చెప్పారు. నియామీలోని భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు గత నెల చివరి నుంచి ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్ సైనిక తిరుగుటు వల్ల తన పదవిని కోల్పోవడం సంచలనం సృష్టించింది. అయితే అక్కడ విదేశాలు దాడులు చేస్తాయని అక్కడి సైనికి ప్రభుత్వం గగనతలాన్ని కూడా మూసివేసింది. ప్రస్తుతం నైగర్ దేశంలోని నిత్యావసర వస్తువులు తీసుకెళ్లడానికి సూపర్ మార్కెట్లకు క్యూలు కడుతున్నారు. పెద్ద మొత్తంలో బియ్యం, వంటనూనెల వంటి ప్రధానమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు ఆ దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నైగర్‌లో సైనిక తిరుగుబాటు వల్ల అక్కడ శాంతి భద్రతలు లేకుండా పోయాయి. అక్కడ ఎప్పుడు సాధారణ పరిస్థితులు వస్తాయో అనే విషయంపై స్పష్టత లేదు. అందుకోసమే భారత విదేశాంగ శాఖ ఈ విషయంలో అప్రమత్తమైంది. వెంటనే అక్కడున్న భారతీయులు రావాలని సూచనలు చేస్తోంది.

నైగర్‌లోని భారతీయులు తిరిగి దేశానికి రావాలంటూ ఇండియన్ ఎంబసీ ట్వీట్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.