AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి భారత ఖ్యాతిని పెంచిన పోలీస్ అధికారి

దేశంలో ఓవైపు 76 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారతీయులు సిద్ధవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ఖ్యాతిని మరింత పెంచేలా పంజాబ్‌కు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి ప్రపంచానికి భారతీయుడి సత్తా చాటిచెప్పాడు. అత్యంత ఎత్తైనటువంటి ఎల్ర్బస్ అనే పర్వతంపై భారతీయ జెండాను ఎగురవేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేశాడు. దీంతో ప్రజలు, అధికారుల, ఉన్నతాధికారులు, అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే పంజాబ్‌కు చెందిన గుర్జోత్ సింగ్ కలేర్ అనే పోలీస్ అధికారి.. రష్యా, యూరప్‌లో అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించాడు.

ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి భారత ఖ్యాతిని పెంచిన పోలీస్ అధికారి
Gurjot Singh Kaler
Aravind B
|

Updated on: Aug 14, 2023 | 5:05 AM

Share

దేశంలో ఓవైపు 76 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారతీయులు సిద్ధవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ఖ్యాతిని మరింత పెంచేలా పంజాబ్‌కు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి ప్రపంచానికి భారతీయుడి సత్తా చాటిచెప్పాడు. అత్యంత ఎత్తైనటువంటి ఎల్ర్బస్ అనే పర్వతంపై భారతీయ జెండాను ఎగురవేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేశాడు. దీంతో ప్రజలు, అధికారుల, ఉన్నతాధికారులు, అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే పంజాబ్‌కు చెందిన గుర్జోత్ సింగ్ కలేర్ అనే పోలీస్ అధికారి.. రష్యా, యూరప్‌లో అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించాడు. అతను ఈ పర్వతాన్ని ఎక్కే సమయంలో భారీ మంచు తుఫానులు, ఉరుములు, క్లిష్టమైన వాతావరణ పరిస్థుతులు ఏర్పడ్డాయి. అయినా కూడా వాటిని తట్టుకోని, పోరాడి ఆగస్ట 11న ఉదయం 7 గంటలకు ఎల్బ్రస్ పర్వతంపైకి కలేర్ బృందం చేరుకుంది. ఆ తర్వాత నలుగురు కలేర్ సభ్యులు బృందం ఆ పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

తమ పర్వతాధిరోహణపై గుర్జోజ్ సింగ్ కలేర్ స్పందించారు. ఈ పర్వతాన్ని ఎక్కేందుకు సుమారు ఐదు రోజుల వరకు సమయం పట్టినట్లు చెప్పారు. అలాగే పర్వతం శిఖరాగ్రంలో వాతావరణం చాలా క్లిష్టంగా ఉందని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోందని అన్నారు. దీనివల్ల ఈ అధిరోహన చాలా కష్టతరమైందని చెప్పారు. ఒకనొక సమయంలో కూడా అసలు ఈ పర్వతం అధిరోహించడం అసాధ్యమని అనిపించినట్లు తెలిపారు. అయినా కూడా తమ పట్టుదలను వదలిపెట్టలేదని.. సంకల్పంతో మందుకు వెళ్లి విజయం సాధించామని పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే వృత్తిపరంగా శిక్షణ పొందిన మౌంటనీర్ కలేర్ ఉత్తరాఖాండ్‌లోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సులో ఉత్తమ పర్వతారోహకుడిగా కూడా ఎంపిక అయ్యారు.

ఇదిలా ఉండగా గుర్జోత్ సింగ్ కలేర్ అంతకుముందు కూడా ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన శిఖరం కిలిమంజారో పర్వాతాన్ని కూడా అధిరోహించారు. అలాగే కొవిడ్ సమయంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన కరోనా యోధుల ధైర్యానికి హృదయపూర్వక నివాళిగా 15 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ కూడా చేశారు. అయితే కలేర్ ప్రస్తుతం ఏఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. 2023 జనవరిలో విధి పట్ల అత్యుత్తమ అంకితభావానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా మెడల్‌ను స్వీకరించారు. మరో విషయం ఏంటంటే రష్యాలోని ఎల్బ్రస్ పర్వతం సముద్రమట్టానికి 5,642 మీటర్ల అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే ఈ పర్వతం చుట్టూ అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. అనేకమంది పర్వాతారోహకులు ఈ పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయాత్నాలు చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్