Cheating: పెళ్లాం కాదు పిశాచి.. ఆ పని కోసం ప్రియుడితో కలిసి లక్షల్లో డీల్.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..

అసలు కథ ఇప్పుడే మొదలైంది. అతన్ని తుపాకీతో కాల్చి చంపేంత శత్రువులు లేరు.. అతనేమీ పెద్ద సెలబ్రిటీ కూడా కాదు.. మరి దుండగులు ఎందుకు కాల్చి చంపారు? ఇదే ప్రశ్న పోలీసులను నిద్రపోనివ్వలేదు. ఇంకేముంది..తమదైన శైలిలో విచారించగా సంచలన విషయం వెలుగు చూసింది. నిజం తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. అసలైన శత్రువును మృతుడి ఇంట్లోనే ఉందని గుర్తించారు పోలీసులు. అవును, కట్టుకున్న భార్యే అతని పాలిట యమపాశమైంది. తన సుఖం కోసం భర్తను అత్యంత దారుణంగా చంపించేసింది. ఇందుకోసం లవర్‌తో కలిసి హంతకులకు లక్షల్లో సుపారీ..

Cheating: పెళ్లాం కాదు పిశాచి.. ఆ పని కోసం ప్రియుడితో కలిసి లక్షల్లో డీల్.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..
Wife And Husband Reprasentative Image
Follow us
Shiva Prajapati

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 13, 2023 | 4:00 PM

అతను ఐటీసీ కంపెనీలో పని చేసే కార్మికులు.. రోజూలాగే బైక్‌పై డ్యూటీకి వెళ్తున్నాడు.. ఆగస్టు 6న తేదీన ఉదయం 6 గంటలకు డ్యూటీ వెళ్తుండగా మార్గం మధ్యంలో గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. దాంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మ్యాటర్ అంతా క్లియర్‌గా ఉందా! అసలు కథ ఇప్పుడే మొదలైంది. అతన్ని తుపాకీతో కాల్చి చంపేంత శత్రువులు లేరు.. అతనేమీ పెద్ద సెలబ్రిటీ కూడా కాదు.. మరి దుండగులు ఎందుకు కాల్చి చంపారు? ఇదే ప్రశ్న పోలీసులను నిద్రపోనివ్వలేదు. ఇంకేముంది..తమదైన శైలిలో విచారించగా సంచలన విషయం వెలుగు చూసింది. నిజం తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. అసలైన శత్రువును మృతుడి ఇంట్లోనే ఉందని గుర్తించారు పోలీసులు. అవును, కట్టుకున్న భార్యే అతని పాలిట యమపాశమైంది. తన సుఖం కోసం భర్తను అత్యంత దారుణంగా చంపించేసింది. ఇందుకోసం లవర్‌తో కలిసి హంతకులకు లక్షల్లో సుపారీ ఇచ్చింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బీహార్‌లోని ముంగేర్‌ ప్రాంతానికి చెందిన ప్రేమ్ నారాయణ్ సింగ్.. ఐటీసీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి శివాని కుమారి అనే భార్య ఉంది. అయితే, రోజూలాగే ప్రేమ్ నారాయణ్ బైక్‌పై కంపెనీలో డ్యూటీకి వెళ్తుండగా.. ఉదయం 6 గంటల సమయంలో పుర్బసరాయ్‌లోని బ్రహ్మస్థాన్ సమీపంలో కొందరు దుండగులు తుపాకీతో కాల్చారు. తీవ్రంగా గాయపడిన ప్రేమ్ నారాయణ్ సింగ్‌ను ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపగా అతని భార్యే ప్రధాన నిందితురాలని తేలింది.

ప్రేమ్ నారాయణ్ సింగ్ భార్య శివాని కుమారి, తన ప్రియుడితో కలిసి భర్తను చంపించేందుకు ప్లాన్ వేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఆ ఇద్దరితో పాటు.. హంతకుడిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తన భర్తపై ఎవరో కాల్పులు జరిపారంటూ తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు అసలు నిజాన్ని తేల్చారు.

ప్రత్యేక బృందం విచారణ..

ఘటనానంతరం ఎస్‌డీపీఓ రాజేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. కేసును గంటల వ్యవధిలోనే తేల్చారు. ఇదే కేసు విషయమైన విలేకరుల సమావేశంలో ఎస్పీ జగనాథరెడ్డి జాలారెడ్డి మాట్లాడుతూ.. మృతుడు ప్రేమ్‌నారాయణ్‌ సింగ్‌, అరెస్టయిన ప్రధాన నిందితుడు గౌరవ్‌కుమార్‌ ఇద్దరూ స్నేహితులని తెలిపారు. ఇద్దరూ ఐటీసీ సిబ్బంది అని వెల్లడించారు.

అరెస్టయిన నిందితుడు గౌరవ్ కుమార్.. ప్రేమ్ నారాయణ్ సింగ్ భార్యతో సుమారు ఆరు నెలలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ ఇద్దరూ రోజూ చాటింగ్ చేసుకునేవారని గుర్తించారు పోలీసులు. గౌరవ్ కుమార్ ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంద్‌లాల్‌పూర్ నివాసి అని ఎస్పీ తెలిపారు. స్నేహితుడి భార్యతో కలిసి హత్యకు కుట్ర పన్ని మరో ఇద్దరు సహచరులతో కలిసి రూ. 7.5 లక్షలకు హంతకులతో డీల్ సెట్ చేశారు. షూటర్స్‌కు రూ. 7 లక్షలు కూడా ఇచ్చారు.

బెగుసరాయ్‌కు చెందిన షూటర్ అభిషేక్ కుమార్, సమస్తిపూర్‌కు చెందిన షూటర్ ఇంద్రజిత్ కుమార్, మహ్మద్ ఇర్షాద్ ఆగస్టు 4న ముంగేర్ చేరుకున్నారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో ఇద్దరు సహచరులు రాజీవ్ కుమార్, దీపక్ కుమార్ దీపుతో కలిసి ప్రేమ్ నారాయణ్ సింగ్‌ను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు. అనుకున్న ప్లాన్ ప్రకారం.. ఆగస్టు 6వ తేదీన ఉదయం హత్య చేశారు.

సీసీటీవీ ఆధారంగా తేలిన నిజం..

హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించిన ఎస్పీ.. సంఘటనా స్థలంలో, చుట్టుపక్కల అమర్చిన సిసిటివి కెమెరాలు నిందితులను గుర్తించడంలో సహాయపడ్డాయని తెలిపారు. పోలీసులు బెగుసరాయ్, సమస్తిపూర్‌లకు వెళ్లి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేయగా విషయం బట్టబయలైంది. గౌరవ్ కుమార్ తన స్నేహితుడు ప్రేమ్ నారాయణ్ సింగ్‌ని హత్య చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చాడని నిందితులు వెల్లడించారు.

భార్య మాస్టర్ ప్లాన్ ను రహస్య కెమెరాల ద్వారా గుర్తించి బట్టబయలు చేసిన భర్త స్టోరీని దిగువన చూడండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..