Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mk 2 Drones: చైనా, పాకిస్తాన్‌కు ఇక దడ పుట్టాల్సిందే.. సరిహద్దుల్లో అధునాతన డ్రోన్ల మోహరింపు..

Heron Mark 2 drones: చైనా, పాకిస్తాన్‌కు దడ పుట్టించేలా భారత్ భద్రతా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే లడఖ్ సహా కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించిన భారత ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా.. సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరించింది ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌. హెరాన్‌ Mk 2 డ్రోన్లను సరిహద్దుల్లో మోహరించారు.

Mk 2 Drones: చైనా, పాకిస్తాన్‌కు ఇక దడ పుట్టాల్సిందే.. సరిహద్దుల్లో అధునాతన డ్రోన్ల మోహరింపు..
Heron Mark 2 Drones
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 13, 2023 | 5:14 PM

Heron Mark 2 drones: చైనా, పాకిస్తాన్‌కు దడ పుట్టించేలా భారత్ భద్రతా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే లడఖ్ సహా కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించిన భారత ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా.. సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరించింది ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌. హెరాన్‌ Mk 2 డ్రోన్లను సరిహద్దుల్లో మోహరించారు. వార్డెన్‌ ఆఫ్‌ నార్తన్‌ స్క్వాడ్రాన్‌ కింద ఈ డ్రోన్లను ఆపరేట్‌ చేస్తున్నారు. మానవరహిత డ్రోన్లతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు చెబుతున్నారు. చైనాతోపాటు పాకిస్తాన్‌ సరిహద్దులపై హెరాన్‌ Mk 2 డ్రోన్లతో వైమానికదళం నిఘా పెట్టింది. శాటిలైట్లతో వీటికి లింక్‌ను ఏర్పాటు చేశారు. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా సులభంగా ఈ డ్రోన్లను ఆపరేట్‌ చేయవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా ఎగిరే సామర్ధ్యం వీటికి ఉంది. ఇంటెలిజెన్స్‌ సేకరణకు, నిఘాకు ఈ డ్రోన్లు చాలా ఉపయోగపడతాయి. ఇజ్రాయెల్‌ ఎయిరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ ఈ డ్రోన్లను తయారు చేసింది. 35 వేల అడుగులో ఎగరే సత్తా ఈ డ్రోన్లకు ఉంది. 150 నాట్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. మొత్తం 97 డ్రోన్లను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. ప్రాజెక్ట్‌ చీతా కింద డ్రోన్ల తయారీకి కేంద్ర చాలా ప్రాధాన్యతను ఇస్తోంది.

హెరాన్‌ Mk 2 డ్రోన్ల ఏఎన్ఐ ట్వీట్..

ఆత్మనిర్భర్‌ భారత్‌లో కూడా ఇలాంటి డ్రోన్ల తయారీకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. పాకిస్తాన్‌ , చైనాలు డ్రోన్ల టెక్నాలజీలో ముందున్నాయి. టర్కీ సాయంతో పాకిస్తాన్‌ చాలా డ్రోన్లను సేకరించింది. దీనికి కౌంటర్‌గా భారత్‌ కూడా ఇజ్రాయెల్‌ సహకారంతో అధునాతన డ్రోన్లను రంగంలోకి దింపుతోంది. ఇందులో భాగంగా హెరాన్‌ Mk 2 డ్రోన్లను సరిహద్దుల్లో వినియోగిస్తున్నారు.

హెరాన్‌ Mk 2 డ్రోన్లు

భారత వైమానిక దళం సరికొత్త హెరాన్ మార్క్ 2 డ్రోన్‌లతో సరిహద్దులను పర్యవేక్షించనుంది. ఉత్తర సెక్టార్‌లోని ఫార్వర్డ్ ఎయిర్ బేస్‌లో నాలుగు అధునాతన హెరాన్ మార్క్-2 డ్రోన్‌లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త హెరాన్ మార్క్-2 డ్రోన్‌లు సుదూర క్షిపణులు, ఇతర ఆయుధ వ్యవస్థలను గుర్తించడం.. వాటిని ధ్వంసం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

ఈ డ్రోన్‌లను చాలా దూరం వరకు ఆపరేట్ చేయవచ్చు. ఇంకా.. 36 గంటలపాటు ఏకధాటిగా వీటిని వినియోగించవచ్చు. అంతేకాకుండా, ఈ డ్రోన్‌లు శత్రు లక్ష్యాలను గణనీయమైన దూరం నుంచి లేజర్ ద్వారా పసిగడతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..