AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VarunTej-Lavanya Tripathi: మెగాహీరో వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠిల పెళ్లి వాయిదా..? అసలు కారణం అదేనా..

వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న సంగతి విధితమే. అలా అన్న వరుణ్‌ నిశ్చితార్ధం జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే నిహారిక విడాకుల బాంబ్‌ పేల్చింది. ఇది జరిగి ఎన్ని రోజులు కూడాకాకపోవడంతో మళ్లీ వెంటనే ఇంట్లో శుభకార్యమంటే అంతగా బాగోదని, అందుకే పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం. మరోవైపు నిహారిక విడాకుల డిప్రెషన్ నుంచి బయటపడి కెరీర్‌పై దృష్టి పెట్టేపనిలో పడింది. పలు వెబ్‌సిరీస్‌లు చేస్తూ.. వెకేషన్స్‌కి వెళ్తూ.. సమయాన్ని ఆస్వాదిస్తోంది. ఇక ఇంట్లో పరిస్థితులు కాస్త సర్దుమనిగాక మరో మంచి ముహుర్తం..

VarunTej-Lavanya Tripathi: మెగాహీరో వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠిల పెళ్లి వాయిదా..? అసలు కారణం అదేనా..
Varun Tej Wedding
Srilakshmi C
|

Updated on: Aug 13, 2023 | 3:00 PM

Share

మెగాప్రిన్స్‌ ఆరడుగుల అందగాడు వరుణ్‌ తేజ్‌, సొట్టబుగ్గల బ్యూటీ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జూన్‌ 9న వేడుకగా జరిగిన సంగతి తెలిసిందే. వరుణ్‌ తండ్రి నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకకు చిరంజీవి, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌తోపాటు మెగా కుటుంబసభ్యులు పాల్గొని సందడి చేశారు. ఇక నిశ్చితార్ధం నాడే పెళ్లి ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నారు ఇరుకుటుంబాల పెద్దలు. వరుణ్-లావణ్య త్రిపాఠిల వివాహం ఆగస్టు చివరి వారంలో జరగనున్నట్లు అప్పట్లో బాగానే ప్రచారం సాగింది. ఆగస్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఐతే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇప్పట్లో వీరి పెళ్లి వేడుక జరిగేలా కనిపించట్లేదు. అసలు మెగా ఇంట పెళ్లి పనులు జరుగుతున్న హడావిడే లేదు.

అతిథులకు శుభలేఖలు పంచడం, బ్యాచిలర్ పార్టీలంటూ.. ఇలా ఏదో ఒకటి జరగాలి కదా.. కానీ చూడబోతే అలాంటిదేం లేకపోయేసరికి పెళ్లి వాయిదా పడిందేమోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఓ బలమైన కారణం వల్ల అనుకున్న తేదీని మార్చుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏమిటా కారణమంటే..

Varun Tej Wedding

Varun Tej Wedding

వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక ఇటీవల చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న సంగతి విధితమే. అలా అన్న వరుణ్‌ నిశ్చితార్ధం జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే నిహారిక విడాకుల బాంబ్‌ పేల్చింది. ఇది జరిగి ఎన్ని రోజులు కూడాకాకపోవడంతో మళ్లీ వెంటనే ఇంట్లో శుభకార్యమంటే అంతగా బాగోదని, అందుకే పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం. మరోవైపు నిహారిక విడాకుల డిప్రెషన్ నుంచి బయటపడి కెరీర్‌పై దృష్టి పెట్టేపనిలో పడింది. పలు వెబ్‌సిరీస్‌లు చేస్తూ.. వెకేషన్స్‌కి వెళ్తూ.. సమయాన్ని ఆస్వాదిస్తోంది. ఇక ఇంట్లో పరిస్థితులు కాస్త సర్దుమనిగాక మరో మంచి ముహుర్తం చూసి పెళ్లి చేయాలని నాగబాబు భావిస్తున్నారని టాక్‌. దీంతో వరుణ్-లావణ్య పెళ్లి ఈ ఏడాది చివర్లో అంటే నవంబరు లేదా డిసెంబరులో జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే దీనిపై ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి వార్తా బయటికి రాలేదు. కొన్నాళ్లు ఆగితే ఏ విషయమనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకూ వేచిచూడవల్సిందే.

ఇవి కూడా చదవండి
Varun Tej Wedding

Varun Tej Wedding

ఇక సినిమాల విషయానికొస్తే.. ‘ముకుంద’ మువీతో తెరంగెట్రం చేసిన వరుణ్‌ విభిన్న కథాంశాలతో కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. వరుణ్‌ తాజా మువీ ‘గాండీవధారి అర్జున’ ఆగస్టు 25న థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో వరుణ్‌ ఓ పాన్‌ ఇండియా మువీ చేయనున్నాడు. దీని తర్వాత కరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు టాక్‌. మరోవైపు, లావణ్య కూడా ఓ సినిమాలో అలాగే, అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై రానున్న ఓ వెబ్‌సిరీస్‌లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుణ్‌-లావణ్య జంటగా 2017లో విడుదలైన ‘మిస్టర్‌’ తొలిసారి కలిసి పనిచేశారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఏడాదిలోనే వీరిద్దరు జంటగా ‘అంతరిక్షం’ అనే మరో మువీలో నటించారు. ఈ క్రమంలోనే వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇలా దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్న ఈ జంట ఏడాది చివర్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.