Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Ankita Lokhande: సుశాంత్‌ మాజీ ప్రేయసి ఇంట తీవ్రవిషాదం.. అంత్యక్రియల్లో పాడె మోస్తూ భావోద్వేగం

ఇండోర్‌కు చెందిన అంకిత నటనపై ఆసక్తికతో 2005లో ముంబైకి వచ్చింది. 'టాలెంట్‌ హంట్‌' రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్తా' సీరియల్‌లో నటించింది. ఈ ధారావాహిక సీరియల్‌తో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సీరియల్‌ షూటింగ్‌ సమయంలో సహనటుడు సుశాంత్‌ సింగ్‌తో ప్రేమలో పడింది. ఆరేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరు ఆ తర్వాత విడిపోయారు. సుశాంత్‌తో బ్రేకప్‌ తర్వాత మరో బాలీవుడ్‌ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది. మూడేళ్ల డేటింగ్‌ అనంతరం 2021 డిసెంబర్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 'మణికర్ణిక','బాఘీ 3' మువీ..

Actress Ankita Lokhande: సుశాంత్‌ మాజీ ప్రేయసి ఇంట తీవ్రవిషాదం.. అంత్యక్రియల్లో పాడె మోస్తూ భావోద్వేగం
Ankita Lokhande
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 13, 2023 | 3:37 PM

బాలీవుడ్‌ నటి అంకిత లోఖండే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటి తండ్రి శశికాంత్‌ లోఖండే (68) శనివారం ఉదయం (ఆగస్టు 12) ముంబైలో కన్నుమూశారు. తండ్రి అంత్యక్రియలు ఆదివారం ముంబైలోని ఓషివారా శ్మశానవాటికలో జరిగాయి. అంత్యక్రియల సమయంలో భర్త విక్కీ జైన్‌తో కలిసి అంకిత తండ్రి పాడె మోసింది. తండ్రి పాడె మోస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యాడు. లోనవుతుండగా భర్త విక్కీ జైన్‌ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. నటులు శ్రద్ధా ఆర్య, కుశాల్ టాండన్, నందీష్ సంధు, ఆర్తి సింగ్, అపర్ణ దీక్షిత్, ఓంకార్ కపూర్‌తోపాటు పలువురు బాలీవుడ్ నటులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

Actress Ankita Lokhande

Actress Ankita Lokhande

కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న శశికాంత్‌ లోఖండే పరిస్థితి విషమించి మరణించారు.

ఇవి కూడా చదవండి

నటి అంకిత తండ్రి అంత్యక్రియల వీడియో..

గత ఫాధర్స్‌ డే రోజు అంకిత తన ఇండ్రికి ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘నా మొదటి హీరో మా నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నా చిన్నతనంలో మీరు ఎంతో కష్టపడటం చూశాను. కానీ మీ పిల్లలు అలా కాకుండా చూసుకున్నారు. నేను ఎగరడానికి రెక్కలు ఇచ్చారు. నేను కోరుకున్నదంతా నాకు దక్కేలా చేశారు. నాకు గుర్తుంది.. ముంబైలో నా కెరీర్‌ ప్రారంభించినప్పుడు కొన్నిసార్లు ఇంటి అద్దె చెల్లించలేనప్పుడు, మీరు నా కలలను విశ్వసించి నాకు సహాయం చేశారు. నేను మీ కూతురిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను.. ఎప్పటికీ.. ఎప్పటికీ..ఎప్పటికీ.. లవ్ యూ పా! హ్యాపీ ఫాదర్స్ డే పా’ అంటూ రాసుకొచ్చింది.

నటి అంకిత తండ్రి అంత్యక్రియల వీడియో..

ఎవరీ అంకిత లోఖండే..?

ఇండోర్‌కు చెందిన అంకిత నటనపై ఆసక్తికతో 2005లో ముంబైకి వచ్చింది. ‘టాలెంట్‌ హంట్‌’ రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె నాలుగేళ్ల తర్వాత ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌లో నటించింది. ఈ ధారావాహిక సీరియల్‌తో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సీరియల్‌ షూటింగ్‌ సమయంలో సహనటుడు సుశాంత్‌ సింగ్‌తో ప్రేమలో పడింది. ఆరేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరు ఆ తర్వాత విడిపోయారు. సుశాంత్‌తో బ్రేకప్‌ తర్వాత మరో బాలీవుడ్‌ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది. మూడేళ్ల డేటింగ్‌ అనంతరం 2021 డిసెంబర్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ‘మణికర్ణిక’,’బాఘీ 3′ మువీల్లో కూడా ఆమె నటించింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటన కేసులో పలుమార్లు అంకితను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.

నటి అంకిత తండ్రి అంత్యక్రియల వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.