Independence Day Celebration 2023 Highlights: వైభవంగా జెండా పండుగ.. ప్రధాని సహా తెలుగు రాష్ట్రాల సీఎంలు..
77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్ దేశం సంబురంగా జరుపుకుంది. దేశ ప్రజలంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సంతోషంగా పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ మొదలు తెలుగు రాష్ట్రాల వరకు వేడుకలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగరవేశారు. అనంతరం జాతీని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. వీరుల బలిదానంతో స్వాతంత్ర్యం వచ్చిందని, త్యాగధనులందరికీ గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నానని అన్నారు...

Independence Day Parade 2023 Highlights: 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్ దేశం సంబురంగా జరుపుకుంది. దేశ ప్రజలంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సంతోషంగా పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ మొదలు తెలుగు రాష్ట్రాల వరకు వేడుకలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఎగరవేశారు. అనంతరం జాతీని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. వీరుల బలిదానంతో స్వాతంత్ర్యం వచ్చిందని, త్యాగధనులందరికీ గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నానని అన్నారు. ఇక మణిపూర్ గురించి ప్రస్తావించిన ప్రధాని.. మణిపూర్‌లో త్వరలోనే శాంతి ఏర్పడుతుందని అన్నారు. దేశమంతా మణిపూర్ వెంట ఉంది. చిన్న సమస్యలే ఇబ్బందిగా మారుతున్నాయని పేర్కొన్నా. ఇక ప్రధానిగా మోదీ పతకావిష్కరణ చేయడం ఇది పదోసారి కావడం విశేషం.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని గోల్కోండ కోటలో జెండా ఎగరవేశారు. అనంతరం ప్రసగించిన కేసీఆర్.. ఎంతో కష్టపడి, మహానీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, ఇప్పుడు స్వేచ్ఛగా బతికే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా స్వేచ్ఛ లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఎంతో కష్టపడి, ఎందరి పోరాటాల కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆకలి చావులు, దుర్భరమైన బతుకులు ఇలా చెప్పుకొంటూ పోతో ఎన్నో కష్టాలు ఉండేవని, దీంతో రాష్ట్ర ప్రజల బతుకులు బాగు కోసం తెలంగాణ సాధించుకున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం నడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జెండా ఎగరవేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన జగన్.. ఎంతో మంది త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. 76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. వ్యవసాయం, పరిశ్రమ , సేవా రంగంలో సుదీర్ఘమైన ప్రగతి ఉందన్నారు. అలాగే గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు తీసుకువచ్చామన్నారు. పౌర సేవలను ఇంటింటికి తీసుకువెళ్లగలిగామని చెప్పుకొచ్చారు.
LIVE NEWS & UPDATES
-
గత పాలకుల చేతిలో తెలంగాణ చితికిపోయింది..
గోల్కోండ కోటలో జెండా ఎగరవేసిన తర్వాత మాట్లాడిన సీఎం కేసీఆర్.. గత పాలకు చేతిలో తెలంగాణ చితికిపోయిందన్నారు. సగత ప్రభుత్వాల తీరుతో తెలంగాణ రైతన్నల జీవితాలు బలయ్యాయని విమర్శించారు. అహింసా మార్గంలోనే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం చెప్పుకొచ్చారు.
-
ఏ ప్రభుత్వం చేయని పనులు చేశాము
తమ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చామని, ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం చేయని గొప్ప మార్పు తీసుకువచ్చినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామని, రాష్ట్రంలో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలను అందించామని వివరించారు.
-
-
స్వాతంత్ర వేడుకల్లో సీఎం జగన్..
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జెండా ఎగరవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించిన మాట్లాడతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు పంట బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నామన్నారు. అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు అండగా నిలుస్తాన్నమన్నారు.
-
జెండా పండుగలో సీఎం జగన్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. జెండా ఎగరవేశారు.
-
ప్రపంచాన్ని మార్చబోతున్నాం..
యువత క్రీడారంగంలో ప్రతిభను చాటుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో రైతులు, కార్మికులది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర ఉందని అన్నారు. అలాగే జీ-20 సదస్సు నిర్వహించే అవకాశం మనకు దక్కిందని, జీ-20 సదస్సుతో ప్రపంచానికి మన సామర్థ్యాన్ని చాటుతున్నామని అన్నారు. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానినిక భారత్‌పై సరికొత్త విశ్వాసమన్నారు. ప్రపంచాన్ని మార్చడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నామని మోదీ అన్నారు.
-
-
మణిపూర్‌లో త్వరలోనే శాంతి..
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌లోనే త్వరలోనే శాంతి నెలకొంటుంది అని చెప్పుకొచ్చారు. దేశమంతా మణిపూర్ వెంటనే ఉందని తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అన్న ప్రధాని.. 140 కోట్ల మంది భారతీయులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
-
జాతీయ జెండా ఎగరవేసిన మోదీ..
ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ జెండా ఎగరవేసిన వెంటనే ఆర్మీ హెలికాప్టర్స్‌లో పూల వర్షం కురిపించారు. జాతీయ జెండా ఎగర వేసిన అనంతరం ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు.
-
రాజ్‌ఘాట్ వద్ద నివాళి అర్పించిన మోదీ..
జాతీయ ఎండ ఎగరవేయడానికి ఎర్రకోటకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్ చేరుకున్నారు. అక్కడ మహాత్మగాంధీకి గాంధీకి నివాళులు అర్పించారు. అనంరం ఎర్రకోటకు బయలుదేరారు.
-
కాసేపట్లో ఎర్రకోటకు ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో ఢిల్లీలోని ఎర్రకోటకు చేరుకోనున్నారు. 730 గంటలకు ప్రధాని జెండా ఎగరవేయనున్నారు. ఎర్రకోట వద్ద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Published On - Aug 15,2023 6:46 AM