Independence Day: స్వాతంత్ర్య వేడుకలకు ముస్తాబైన చారిత్రక కట్టడాలు.. మువ్వన్నెలతో మురిసిపోతున్న నిర్మాణాలు
స్వాతంత్ర్య దినోత్సవ వేళ తెలంగాణ వ్యాప్తంగా చారిత్రక కట్టడాలు అందంగా ముస్తాబయ్యాయి. మువ్వన్నెల రంగుల్లో మిరుమిట్లు గొల్పుతున్నాయి. విద్యుత్ ధగధగలతో మెరుస్తున్న కట్టడాలను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. ప్రత్యేకించి తెలంగాణ సెక్రటేరియట్, చార్మినార్, హైకోర్టు భవనాలతోపాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. వరంగల్ ఖిలాతోపాటు వేయిస్తాంభాల గుడి మువ్వెన్నలతో మురిసిపోతోంది. భరతజాతి గర్వించేలా.. చారిత్రక కట్టడాలపై మూడురంగుల జెండా రెపరెపలాడుతోంది.
స్వాతంత్ర్య దినోత్సవ వేళ తెలంగాణ వ్యాప్తంగా చారిత్రక కట్టడాలు అందంగా ముస్తాబయ్యాయి. మువ్వన్నెల రంగుల్లో మిరుమిట్లు గొల్పుతున్నాయి. విద్యుత్ ధగధగలతో మెరుస్తున్న కట్టడాలను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. ప్రత్యేకించి తెలంగాణ సెక్రటేరియట్, చార్మినార్, హైకోర్టు భవనాలతోపాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. వరంగల్ ఖిలాతోపాటు వేయిస్తాంభాల గుడి మువ్వెన్నలతో మురిసిపోతోంది. భరతజాతి గర్వించేలా.. చారిత్రక కట్టడాలపై మూడురంగుల జెండా రెపరెపలాడుతోంది. 77 స్వాతంత్ర్య వేడుకలకు దేశవ్యాప్తంగా సిద్ధమయ్యాయి. హర్ ఘర్ తిరంగా పిలుపుతో చారిత్రక కట్టడాలతోపాటు ప్రతిఇంటిపైనా మువ్వన్నెల పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటుతున్నారు. దేశవిభజన సమయంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించి వారి త్యాగాలను గుర్తుచేసుకుంటున్నారు. అమరుల త్యాగాలను వృథా కానివ్వబోమని తెగేసి చెబుతున్నారు.
వేడుకలకు సిద్ధమైన గోల్కొండ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాలతో గోల్కొండలో స్వాతంత్ర్య వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకోసం గోల్కొండను అందంగా ముస్తాబు చేశారు. గోల్కొండలో వేడుకల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. భద్రతా లోపాలు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. నిఘావర్గాల హెచ్చరికలతో భద్రత విషయంలో రాజీపడని పోలీసులు పాతబస్తీలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రత్యేకించి చార్మినార్ ప్రాంతంలోని లాడ్జిల్లో ఉగ్రవాదులు దాగి ఉండొచ్చన్న అనుమానంతో అడుగడుగూ సోదాలు చేస్తున్నారు. సౌత్ జోన్ డీసీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో MGBS బస్టాండ్‌తోపాటు అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తూ వారు నగరానికి ఏ పని మీద వచ్చారన్న వివరాలను సేకరిస్తున్నారు. ఏమాత్రం డౌటొచ్చినా స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో భదత్ర విషయంలో రాజీపడబోమంటున్నారు పోలీసులు. ఇప్పటికే గోల్కొండను పరిశీలించిన డీజీపీ అంజనీ కుమార్.. సిబ్బందికి కీలక సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయజెండాను ఆవిష్కరించే ప్రాంతాన్ని ఇప్పటికే డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేసిన పోలీసులు.. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రసంగంలో ఏం చెబుతారు? దేశవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని చాటేలా సాగే వేడుకల్లో సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రసంగం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన సర్కార్.. ఇండిపెండెన్స్ డే సాక్షిగా మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రగతిపై ప్రసంగించనున్న కేసీఆర్.. కీలక ప్రకటన ఖాయమంటున్నారు రాజకీయవిశ్లేషకులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి