AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కలవరపెడుతోన్న గుండెపోట్లు.. 22 ఏళ్ల యువకుడు క్రికెట్‌ ఆడుతూ మైదానంలోనే..

నంద్యాల బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్‌ కాలనీకి చెందిన మహేంద్ర (22) ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి సమీపంలోని ఎల్‌పీజీ సిలిండర్ గోడౌన్ వద్ద క్రికెట్‌ ఆడటానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడుతున్న మహేంద్ర ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. దీంతో స్నేహితులు భయంతో చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. స్థానికులు వెంటనే మహేంద్రను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మహేంద్రను పరీక్షించి అప్పటికే అతను గుండెపోటుతో..

Andhra Pradesh: కలవరపెడుతోన్న గుండెపోట్లు.. 22 ఏళ్ల యువకుడు క్రికెట్‌ ఆడుతూ మైదానంలోనే..
Man Dies Of Heart Attack
Srilakshmi C
|

Updated on: Aug 14, 2023 | 3:23 PM

Share

కర్నూలు, ఆగస్టు 14: వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు. యువకులు, స్కూల్ పిల్లల గుండెలు కూడా ఒక్కసారిగా ఆగిపోయి మృత్యువాత పడటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని 22 ఏళ్ల యువకుడు స్నేహితులతో క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో ఒక్కాసారగా కుప్పకూలిపోయాడు. వివరాల్లోకెళ్తే..

నంద్యాల బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్‌ కాలనీకి చెందిన మహేంద్ర (22) ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి సమీపంలోని ఎల్‌పీజీ సిలిండర్ గోడౌన్ వద్ద క్రికెట్‌ ఆడటానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడుతున్న మహేంద్ర ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. దీంతో స్నేహితులు భయంతో చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. స్థానికులు వెంటనే మహేంద్రను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మహేంద్రను పరీక్షించి అప్పటికే అతను గుండెపోటుతో మరణించినట్లు ధృవీకరించారు. చేతికందివచ్చిన కొడుకు హఠాత్తుగా దూరమవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. నంద్యాల జిల్లాలో ఆదివారం నాడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో 21 ఏళ్ల లారీ డ్రైవర్ మృతి చెందడం, రెండు రోజుల్లో ఇది రెండో మరణం కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ద్విచక్ర వాహనంపై వెళుతూ గుండెపోటు..

శనివారం జరిగిన మరో ఘటనలో 35 ఏళ్ల పెద్దఈరన్న అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళుతూ గుండె పోటుతో మృతి చెందాడు. బాధితుడు పెద్దఈరన్న కర్నూలు కోసిగి మండలం తిప్పలదొడ్డికి వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వాహనాన్ని రోడ్డుపక్కన ఆపి నేలపై కూర్చున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. కొద్ది సేపటికే అతను మరణించాడు. అతని వద్ద ఫోన్‌ ఆధారంగా అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

క్రికెట్‌ ఆడుతూనే మరో యువకుడు..

ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఓ యువకుడు క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. ఆంజనేయులు అనే యువకుడు మధ్యాహ్న సమయంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. క్రికెట్ అడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు ఆంజనేయులును సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు వెల్లడించారు. గతంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో కూడా పదమూడేళ్ల ఏళ్ల బాలిక కూడా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.