TTD: భూమన అధ్యక్షతన టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం.. చిరుత దాడి నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులతో
ఈ సమావేశంలో చిరుత దాడులకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించనున్నారు. సమావేశానికి ఫారెస్ట్ అధికారులను సైతం హాజరుకానున్నారు. నడక మార్గంలో చిరుతల సంచారం, భక్తుల భద్రతపై చర్చించనున్నారు. ఇప్పటికే వైల్డ్ లైఫ్ ఎక్స్‌పర్ట్స్ ఇచ్చిన నివేదికపై కూడా చర్చించనున్నారు. దీంతో ఈ సమావేశంపై అందరి దృష్టి పడింది. పులులను కంట్రోల్ చేయడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది....
తిరుమల నడక దారిలో చిరుత దాడిలో మరణించిన చిన్నారి ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పులి దాడిలో ఆరేళ్ల చిన్నారి లక్షిత మరణించడం అందరినీ కలిచి వేసింది. దీంతో టీటీడీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. భక్తుల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకునేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగానే టీటీడీ ఛైర్మన్ భూమన అధ్యక్షత టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. మరికాసేపట్లో ఈ సమావేశాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ సమావేశంలో చిరుత దాడులకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించనున్నారు. సమావేశానికి ఫారెస్ట్ అధికారులను సైతం హాజరుకానున్నారు. నడక మార్గంలో చిరుతల సంచారం, భక్తుల భద్రతపై చర్చించనున్నారు. ఇప్పటికే వైల్డ్ లైఫ్ ఎక్స్‌పర్ట్స్ ఇచ్చిన నివేదికపై కూడా చర్చించనున్నారు. దీంతో ఈ సమావేశంపై అందరి దృష్టి పడింది. పులులను కంట్రోల్ చేయడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే టీటీడీ ఈవో ధర్మారెడ్డి చిరుతల్ని పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎంత ఖర్చు అయినా వెనకాడేది లేదని తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కి అన్ని రకాల సహాయం అందిస్తామని తేల్చి చెప్పారు. భక్తు భద్రతకు పెద్ద పీట వేస్తూ, అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక వైల్డ్ నిపుణులు ఇప్పటికే టీటీడీకి పలు కీలక సూచనలు చేశారు. నడకమార్గంలో భద్రత పెంచాలని ప్రతిపాదనను తీసుకొచ్చారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
అంతేకాకుండా నడకమార్గంలో ఉన్న దుకాణాల్లో ఏర్పడుతున్న వేస్టేజ్‌తో జంతువులు వస్తున్నట్టు గుర్తించామన్నారు. నడకమార్గంలో ఇరువైపుల పొదలు తొలగించాలన్నారు. ఇక నడకదారుల్లోకి చిరుతలు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మంచిదే అయినా ఒక్కోసారి దానివల్ల నష్టమే ఎక్కువ జరుగుతుందన్నారు వైల్డ్ లైఫ్ ఎక్స్‌పర్ట్ శాంతిప్రియ పాండే. చిన్నారి లక్షితపై చిరుత వాంటెడ్లీ దాడి చేసి ఉండకపోవచ్చన్న శాంతి ప్రియ.. అలాగే చిరుత.. ఎలుగుబంటి దాడులు వేర్వేరుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. మొత్తం చిరుత దాడి నేపథ్యంలో అధికారులు సీరియస్‌గా రంగంలోకి దిగినట్లు స్పష్టమవుతోంది. మరో సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఇక చిరుత దాడి నేపథ్యంలో తిరుమల నడక మార్గాల్లో చిన్నారుల అనుమతిపై టీటీడీ ఆంక్షలు సైతం విధించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిలిపివేశారు. అలాగే ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి ట్యాగ్‌లు సైతం వేస్తున్నారు. దీంతో ఒకవేళ పిల్లలు తప్పిపోతే సులభంగా గుర్తించేందుకు ఈ ట్యాగ్‌లు ఉపయోగడపడతాయని టీటీడీ అభిప్రాయపడుతోంది. ఈ ట్యాగ్‌లపై పిల్లల పేరు, వారి పేరెంట్స్ వివరాలు, ఫోన్ నెంబర్ పోలీసులు టోల్ ఫ్రీ నెంబర్ వంటి వివరాలను నమోదు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..